Trisha's Shelved Film Finally: 12 ఏళ్లుగా ల్యాబ్‌లోనే మగ్గిపోయిన త్రిష సినిమా.. ఇప్పుడు రిలీజ్ ప్లాన్..
ఇప్పుడు రిలీజ్ ప్లాన్..
Trisha's Shelved Film Finally: సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలో దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగిస్తోంది చెన్నై చందురి త్రిష. హారర్, కామెడీ, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే, ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు, ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో.. సోషల్ మీడియాలో త్రిష పేరు మార్మోగిపోతోంది. ఈ వ్యక్తిగత, రాజకీయ బజ్ కారణంగా కోలీవుడ్ మార్కెట్‌లో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది.
ఇప్పుడు సరిగ్గా ఇదే క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కోలీవుడ్ మేకర్స్ ఒక క్రేజీ ప్లాన్ వేస్తున్నారు. ఏకంగా 12 ఏళ్లుగా విడుదలకు నోచుకోకుండా అటకెక్కిన త్రిష పాత సినిమాను ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ల్యాబ్‌కే పరిమితమైన శతురంగ వెట్టై-2
త్రిష, సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో.. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హై-వోల్టేజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ శతురంగ వెట్టై-2. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు 2014లోనే పూర్తయింది. కానీ ఆ సమయంలో నిర్మాతలకు ఎదురైన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కోర్టు వివాదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ థియేటర్ల ముఖం చూడకుండా ల్యాబ్‌లోనే మగ్గిపోయింది.
ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ ఎందుకు?
గడిచిన పన్నెండేళ్లుగా ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం తమిళనాడులో త్రిషకు ఉన్న విపరీతమైన పాపులారిటీ, పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తున్న బజ్ నేపథ్యంలో.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే ప్రేక్షకుల్లో కచ్చితంగా క్యూరియాసిటీ ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడానికి ఇదే సరైన సమయమని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అందుకే 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ‘శతురంగ వెట్టై-2’ను అతి త్వరలోనే గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు కోలీవుడ్ వర్గాల్లో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.