Bigg Boss: బిగ్‌బాస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్.. ఆరుగురి ఎంట్రీ
ఇద్దరు ఎలిమినేట్.. ఆరుగురి ఎంట్రీ
Bigg Boss: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 ఆట రంజుగా మారుతోంది. ఐదో వారం ముగింపు సందర్భంగా హౌస్‌లో భారీ ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఒకేసారి ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోగా, అంచనాలకు తగ్గట్టుగా ఆరుగురు కొత్త సభ్యులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించారు. ఈ డబుల్ ఎలిమినేషన్, భారీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో బిగ్‌బాస్ 2.0 మొదలైందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఐదో వారంలో సాధారణంగా ఒక ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించినా, బిగ్‌బాస్ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ షాక్ ఇచ్చాడు. సినీ నటి ఫ్లోరా షైనీ తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయినట్లు సమాచారం. హౌస్‌లో కొంతవరకు సైలెంట్‌గా ఉండటం, కంటెంట్ ఇవ్వడంలో వెనుకబడటం ఆమె ఎలిమినేషన్‌కు కారణంగా కనిపిస్తోంది. రెండో ఎలిమినేషన్‌గా 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష' ద్వారా హౌస్‌లోకి వచ్చిన శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యింది. శ్రీజ ఎలిమినేషన్ పట్ల ఆమె అభిమానులు, నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్‌తో కాకుండా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు ఇచ్చిన పవర్‌తో శ్రీజ ఎలిమినేట్ అయ్యిందని, ఇది అన్యాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారన్న విమర్శల నేపథ్యంలో, బిగ్‌బాస్ ఏకంగా ఆరుగురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపారు. వీరిలో కొందరు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నవారు కావడం విశేషం.
రమ్య మోక్ష (అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్): సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ తన గ్లామర్, కాంట్రవర్సీ మాటలతో హౌస్‌లో రచ్చ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఈమె హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే కొందరు కంటెస్టెంట్లకు 'ఓవర్ యాక్టింగ్', 'ఫేక్' వంటి పికిల్స్ ఇచ్చి బాంబ్ వేసింది.
శ్రీనివాస్ సాయి: 'గోల్కొండ స్కూల్' వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో కూడా బిగ్‌బాస్ ఎంట్రీ ఇచ్చాడు.
దివ్వెల మాధురి: వై.ఎస్.ఆర్.సి.పి. మాజీ సభ్యురాలుగా వార్తల్లో నిలిచిన దివ్వెల మాధురి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టింది.
అయేషా: తమిళ బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారిన నటి ఆయేషా కూడా తెలుగు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది.
గౌరవ్ గుప్తా: ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రిటీ.
నిఖిల్ నాయర్ : 'గృహలక్ష‍్మి' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులు బాగా పరిచయం. 'పలుకే బంగారమాయెనా' సీరియల్‌లోనూ హీరోగా నటించాడు. ఓ వెబ్ సిరీస్ కూడా చేశాడు. హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఫిజికల్ టాస్కుల్లో మిగతా వాళ్లకు పోటీ ఇవ్వడం గ్యారంటీ.
ఈ భారీ మార్పులతో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఆట పూర్తిగా మారిపోనుందని, హౌస్‌లో ఇకపై మరింత రసవత్తరమైన ఫైట్స్, టాస్క్‌లు చూడొచ్చని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.