'Uppena' beauty Krithi Shetty: చిరంజీవి కూతురిగా 'బేబమ్మ'?
కూతురిగా 'బేబమ్మ'?
'Uppena' beauty Krithi Shetty: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 158వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాకుండా, ఆయన కూతురి పాత్రలో కృతి శెట్టి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ ప్రకారం తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలైట్ అని, అందుకే నటనకు ప్రాధాన్యమున్న ఈ పాత్ర కోసం కృతిని సంప్రదించారని సమాచారం. వరుస పరాజయాలతో ఉన్న కృతి శెట్టికి, మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉంది. చిరంజీవి భార్యగా అలనాటి హీరోయిన్ ప్రియమణి నటించనున్నట్లు టాక్. షూటింగ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే, కృతి శెట్టి ఎంపికపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలోనే మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు.