Varanasi to Release: వారణాసి రిలీజ్ అయ్యేది ఆ రోజే.. జక్కన్న మాస్టర్ ప్లాన్
జక్కన్న మాస్టర్ ప్లాన్
Varanasi to Release: భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేలా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఏకంగా సినిమా విడుదల తేదీ ఖరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వారణాసి నగరంలోని ప్రధాన కూడళ్లలో వెలిసిన హోర్డింగ్స్‌లో In Theatres April 7, 2027 అని స్పష్టంగా ఉంది. ఏప్రిల్ 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది, ఉత్తరాదిలో గుడి పడ్వా పండుగలు ఉన్నాయి. భారీ సెలవులను క్యాష్ చేసుకునేందుకు జక్కన్న ఈ తేదీని లాక్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనస్ నటిస్తుండగా, పవర్ ఫుల్ విలన్ కుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు.
నిజమా? ఫ్యాన్ మేడ్ హైపా?
గతంలో ఈ సినిమాను 2027 మార్చి 25న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారణాసిలో హోర్డింగ్స్ కనిపించడం, గ్లోబల్ మీడియా సంస్థల సోషల్ హ్యాండిల్స్‌లో కూడా ఈ తేదీ కనిపించడంతో ఇది రాజమౌళి శైలిలో సైలెంట్ ప్రమోషన్ కావచ్చని నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో 1.43:1 రేషియోతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డు సృష్టించబోతోంది.
ప్రస్తుతానికి ఈ తేదీపై మేకర్స్ నుండి ఎటువంటి అధికారిక పత్రికా ప్రకటన రాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రియాంకా చోప్రా కూడా ఇటీవల తన షెడ్యూల్ పూర్తి చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు.