Vijay Devarakonda : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ ముందు హాజరైన వీడీ
విజయ్ దేవరకొండను విచారిస్తున్న ఈడీ;
అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసినందుకు తీసుకున్న పారితోషకం, కమిషన్లపై ఈడీ అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. నేడు బుధవారం హీరో విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. చట్టవిరుద్దమైన యాప్స్ ప్రమోట్ చేయడం ద్వారా అందిన పారితోషకం విషయంలో మనీ ల్యాండరింగ్ జరిగిన కోణంలో ఈడీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసును విచారిస్తోంది. ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలతో పాటు బాహుబలి ఫేమ్ దగ్గుబాటి రానాను కూడా ఆగస్టు 11న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అలాగే మంచు లక్ష్మిని కూడా ఆగస్టు 13న ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.