Bollywood Actor Hasrani: బాలీవుడ్ ప్రముఖ నటుడు హస్రాని కన్నుమూత

నటుడు హస్రాని కన్నుమూత

Update: 2025-10-21 06:07 GMT

Bollywood Actor Hasrani: బాలీవుడ్ ప్రముఖ నటుడు, హాస్యనటుడు గోవర్ధన్ అస్రానీ అక్టోబర్ 20 న సాయంత్రం ముంబైలో కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

975లో వచ్చిన క్లాసిక్ చిత్రం 'షోలే' లో ఆయన పోషించిన 'జైలర్' పాత్ర చాలా ప్రసిద్ధి చెందింది. అందులోని "హమ్ అంగ్రేజోన్ కే జమానే కే జైలర్ హై" అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ప్రాచుర్యం పొందింది. 50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. ఆయన 350కి పైగా హిందీ చిత్రాలలో నటించి, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించారు.

బావర్చి, నమక్ హరామ్, చుప్కే చుప్కే, అభిమాన్, పరిచయ్, చోటీ సీ బాత్, రాఫూ చక్కర్, ఇటీవల భూల్ భూలయ్యా, వెల్కమ్ వంటి చిత్రాలలో కూడా నటించారు.

నటుడిగానే కాకుండా, కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.అస్రానీ మరణం బాలీవుడ్‌కు తీరని లోటు..ఆయన మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News