KC Bokadia: అమితాబ్, సల్మాన్‌లతో నా అనుభవాలు!
బాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ బోకాడియా (KC Bokadia) సల్మాన్ ఖాన్‌తో జరిగిన ఒక సరదా సంఘటనను షేర్ చేసుకున్నారు.
భారతీయ సినిమా ప్రపంచంలో ఐదు దశాబ్దాలకు పైగా చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు, నిర్మత కె.సి. బోకాడియా (K.C. Bokadia). 1970లో సంజీవ్ కుమార్, సంజీవ్ సిన్హాల 'ప్యార్ ఝుక్తా నహీన్', 'తేరీ మెహర్బానియాన్', 'ఫూల్ బనే అంగారే' వంటి ఎన్నో అద్భుతమైన క్లాసిక్ సినిమాలను ఆయన మనకు అందించారు. ఇండియన్ సినిమాలోనే టాప్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ వంటి దిగ్గజాలతో పనిచేసిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఐదు పదుల కాలంగా పరిశ్రమలో ఉన్నా, ఇప్పటికీ ఆయన అదే ఉత్సాహంతో సినిమాలు తీస్తున్నారు.
'తీస్రీ బేగం' వెనుక అసలు కథ
జూలై 18, 2026న విడుదలవుతున్న ఆయన కొత్త చిత్రం "తీస్రీ బేగం" (Teesri Begum) ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా టైటిల్ చూసి చాలామంది ఇది కాంట్రవర్సీకి దారితీస్తుందేమో అని భావించారు. కానీ బోకాడియా గారు దీనిపై స్పందిస్తూ – "నేను ఒక నిజజీవిత సంఘటనను చూసి ఈ కథ రాసుకున్నాను. ముగ్గురు వేర్వేరు మతాలకు చెందిన మహిళలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి జీవితం నన్ను ఆలోచింపజేసింది. అయితే ఇది బహుభార్యాత్వాన్ని (Polygamy) ప్రోత్సహించే సినిమా కాదు. సంబంధాలు, భావోద్వేగాలు, మనుషులు తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే పరిణామాలను చూపించే ఒక సామాజిక చిత్రం" అని స్పష్టం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసం, కాంట్రవర్సీల కోసం సినిమాలు తీయడం తనకు ఇష్టం ఉండదని, కంటెంట్ నాణ్యతతోనే ప్రేక్షకులను మెప్పించాలని ఆయన నమ్ముతున్నట్లు చెప్పారు.
సల్మాన్ ఖాన్‌తో అనుభవం & ఇతర నటులతో బాండింగ్
సూపర్ స్టార్లతో పనిచేసిన అనుభవాలను పంచుకుంటూ, సల్మాన్ ఖాన్‌తో జరిగిన ఒక సరదా సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒక సీన్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ ఎంతో సీరియస్‌గా సిద్ధమవుతూ.. దర్శకుడితో "బోకాడియా సెట్‌లో ఉంటే నేను కొంచెం కాన్షియస్ అవుతున్నాను, ఆయన్ని కాసేపు పక్కకు వెళ్లమని చెప్పాలని నవ్వుతూ కోరారట. ఈ విషయాన్ని బోకాడియా ఎంతో సరదాగా తీసుకున్నారు. అలాగే రాకేష్ బేడి, దర్శన్ జరివాలా వంటి సీనియర్ నటులతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాకేష్ బేడి ఎంత పెద్ద విజయం సాధించినా, ఇప్పటికీ ఎంతో ఒద్దికగా ఉంటారని ప్రశంసించారు.
అమితాబ్, షారుఖ్‌లతో మళ్లీ సినిమా చేసే ప్లాన్స్
అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రాలతో మళ్లీ పనిచేస్తారా అని అడిగినప్పుడు.. "సరైన కథ సిద్ధమైతే నేను ఖచ్చితంగా అమితాబ్ గారిని లేదా షారుఖ్, సల్మాన్‌లను ప్రొచ్ అవుతాను. నాకు మంచి కథ దొరకడమే ఆలస్యం, నటులను అడగడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే వారితో నాకు మంచి సంబంధాలు, గౌరవం ఉన్నాయి" అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన "తీస్రీ బేగం"తో పాటు కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఓ అద్భుతమైన టెలివిజన్ సిరీస్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
నేటి పరిశ్రమకు, వర్ధమాన దర్శకులకు ఆయన ఇచ్చే సందేశం
సినిమా నిర్మాణంలో బడ్జెట్ కంటే కథే ప్రధానమైనదని బోకాడియా (KC Bokadia) తెలిపారు. స్టార్లు బ్రాండ్‌గా ఉపయోగపడవచ్చు, కానీ అంతిమంగా కంటెంట్ మాత్రమే రాజు (Content is King). మీ ఉద్దేశం స్పష్టంగా ఉండి, నిజాయితీగా కష్టపడితే విజయం, మనీ అవే వస్తాయని చెప్పారు. కొత్త దర్శకులకు ఆయన ఇచ్చిన సలహా? మీ కథను నమ్మండి. అందరినీ గౌరవించండి. చౌకబారు వివాదాల వెనుక పడకండి. సహనం, నిజాయితీ ఉంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆదరిస్తారు.