Vijay Antony’s ‘Mark Antony’ Now on OTT: ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ ‘మార్గన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
స్ట్రీమింగ్ ఎక్కడంటే!;
Vijay Antony’s ‘Mark Antony’ Now on OTT: విజయ్ ఆంటోనీ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'మార్గన్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం జులై 25, 2025 (ఈరోజు) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. తమిళ వెర్షన్ మాత్రం కోలీవుడ్‌కు చెందిన ఓటీటీ సంస్థ టెంట్ కొట్ట (Tentkotta)లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారు ఈ వారాంతంలో ఈ సినిమాను చూడొచ్చు. ఇది ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్. సీరియల్ హత్యలు, వాటిని ఛేదించే ఇన్వెస్టిగేషన్ చుట్టూ కథ తిరుగుతుంది.
హైదరాబాద్‌లో ఒక యువతి దారుణంగా హత్యకు గురవుతుంది. ఆమె శరీరం నల్లగా మారి, చెత్తకుప్పలో దొరుకుతుంది. ఈ కేసును ఛేదించడానికి ముంబై నుంచి ధ్రువ్ (విజయ్ ఆంటోనీ) అనే అడిషనల్ డీజీపీ హైదరాబాద్ వస్తాడు. తన కూతురు కూడా ఇలాగే హత్యకు గురవడంతో, ధ్రువ్ ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు. దర్యాప్తులో భాగంగా, అతీంద్రియ శక్తులున్న ఒక యువకుడు (అజయ్ ధీషన్) ఈ కేసులో ఎలా భాగమయ్యాడు, అసలు హంతకుడు ఎవరు, వారి ఉద్దేశ్యం ఏమిటి అనేది సినిమా కథ.
విజయ్ ఆంటోనీ ఒక పోలీస్ ఆఫీసర్ "ధ్రువ్" పాత్రలో నటించారు. తన గత పాత్రలతో పోలిస్తే ఇది కొత్త పాత్ర కాకపోయినా, తనదైన శైలిలో చక్కగా నటించారు. సినిమాలో అతని ప్రత్యేకమైన లుక్, దానికి గల కారణం సస్పెన్స్‌గా ఉంచుతారు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించింది. విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు సంగీతం కూడా అందించారు. సినిమా విడుదల కాకముందే, చిత్ర యూనిట్ మొదటి 6 నిమిషాల సినిమాను విడుదల చేసి, ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది.