Vijay Devarakonda: ఈడీ విచారణకు విజయ్ దేవర కొండ
విచారణకు విజయ్ దేవర కొండ;
Vijay Devarakonda: నటుడు విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ED దర్యాప్తు జరుపుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రముఖులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
విజయ్ దేవరకొండ కొన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ ప్రమోషన్ల ద్వారా వచ్చిన ఆర్థిక లావాదేవీలపై ED అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమోషన్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని ED అనుమానిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ బెట్టింగ్ యాప్‌లు వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టాయని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ కేసులో విజయ్ దేవరకొండ ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ప్రముఖులు ED విచారణకు హాజరుకానున్నారు.ఇప్పటికే ప్రకాష్ రాజ్ జూలై 30న ED విచారణకు హాజరయ్యారు. ఈ కేసు 2016 నాటిదని, తాను ఏ డబ్బులు తీసుకోలేదని ఆయన మీడియాకు తెలిపారు.రానా ఆగస్టు 11న ED ముందు హాజరుకానున్నారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ED నోటీసులు పంపింది. ఈ జాబితాలో నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, శ్రీముఖి వంటి మొత్తం 29 మంది సెలబ్రిటీలు, యూట్యూబర్లు ఉన్నట్లు తెలుస్తోంది.