Vijay Deverakonda: మీరు నాకు దేవుడిచ్చిన వరం
దేవుడిచ్చిన వరం;
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. వారి అభిమానాన్ని చూసి విజయ్ దేవరకొండ కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ ఈవెంట్ లో అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్ ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఇది తన సినిమా 'కింగ్ డమ్' కాదని, ఇది దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ ల 'కింగ్ డమ్' అని అన్నారు. తన అభిమానులు తనకు దేవుడిచ్చిన వరమని, తనను కొడుకులా చూసుకుంటున్నారని భావోద్వేగంతో మాట్లాడారు.
విజయ్ దేవరకొండకు సరైన బ్లాక్‌బస్టర్ హిట్ అవసరం ఉన్న సమయంలో "కింగ్ డమ్" విడుదలవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, విజయ్ కొత్త యాక్షన్ అవతార్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. జులై 31 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.