Vishwambhara: ఓజీ, అఖండ మధ్యలో విశ్వంభర.!
మధ్యలో విశ్వంభర.;
Vishwambhara: పవన్ కల్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. థియేట్రికల్ ఒప్పందాలు అతి త్వరలో ముగిసే అవకాశం ఉంది. జియో హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ హక్కుచేసుకుంది. మరో వైపు బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 కూడా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు
అయితే ఇదే సమయంలో ఇద్దరి మధ్య చిరంజీవి, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి ఒక పాట మినహా మిగతా పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపుదిద్దకుంటున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోసియో ఫాంటసీ మూవీ విడుదల ఎప్పుడన్న చర్చ జోరుగా సాగుతోంది. దసరా సీజన్ లో సెప్టెంబర్ 18న విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.అంటే ఓజీ సినిమా కన్నా ముందే విశ్వంభర విడుదలవుతుంది.