War 2 Event Held in Vijayawada: విజయవాడలో వార్ 2 ఈవెంట్.. స్పందించిన టీం
స్పందించిన టీం
War 2 Event Held in Vijayawada: వార్ 2 సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 10న ఏపీలోని విజయవాడలో ఈవెంట్ నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. ఇంకా వేదిక కన్ఫర్మ్ చేయలేదని చెప్పింది. కన్ఫర్మ్ అయ్యాక అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. ఈ సినిమా ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో ఈవెంట్ జరుగుతుందని ప్రచారం జరిగింది. ఈ ఈవెంట్‌కు హృతిక్ రోషన్ ,జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ హాజరయ్యే అవకాశం ఉందని టాక్ వచ్చింది. ఇదే జరిగితే అభిమానులకు పెద్ద పండుగే.
వార్ 2 యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తుంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.జూలై 25 న విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదల కానుంది.