FISH VENKAT : ఫిష్ వెంకట్ ను బతికించుకుంటాం

వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది-మంత్రి శ్రీహరి;

Update: 2025-07-07 07:01 GMT

తెలుగు సినీ నటుడు ఫిస్‌ వెంకట్ ను బతికించుకుంటామని, ఆయనకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మత్స్య, పశుసంవర్ధక, క్రీడా శాఖల మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్‌ వెంకట్‌ ను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి వ్యక్తిగతంగా ఫిష్‌ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అలాగే వెంకట్‌ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని మంత్రి శ్రీహరి హామీ ఇచ్చిరు. ఫిష్‌ వెంకట్‌ ని పరామర్శించిన వారిలో మంత్రి శ్రీహరితో పాటు తెలంగాణ ఫిషరీష్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనరెడ్డిలు ఉన్నారు. ఇదిలా ఉండగా కొన్నేళ్ళ క్రితం బీపీ, షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోవడంతో ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ క్రమంలో వెంకట్‌ రెండు కిడ్నీలు చెడిపోయి ఆరోగ్య పరిస్ధితి ఆందోళన కరంగా తయారవడంతో వైద్యులు ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ దశలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తప్పదని వైద్యులు చెప్పారు. ఈ విషయంల తెలిసిన కొందరు దాతలు ఆసుపత్రికి వెళ్లి ఫిష్‌ వెంటక్‌ చికిత్సకు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి కలగజేసుకుని ఫిష్‌ వెంకట్‌ ట్రీట్‌మెంట్‌ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News