HHVM MOVIE : హరిహరవీరమల్లు సినిమాని అడ్డుకుంటాం
చరిత్రను వక్రీకరిస్తున్నారి మండిపడుతున్న బీసీ సంఘాలు;
బహుజన ఉద్యమాల చరిత్రను వక్రీకరించే విధంగా ఉన్న హరిహరవీరమల్లు చిత్రాన్ని అడ్డుకుంటామని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి, బీసీ సంఘం నాయకుడు శివ ముదిరాజ్ ప్రకటించారు. ఈ అంశంపై సోమాజీగూడ్ ప్రెస్ క్లబ్ లో ఆయన పలువరు బీసీ సంఘాల నేతలతో ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాపోరాట యోధుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని ఎక్కడా లేని కల్పిత పాత్రలతో సినిమా తస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వీరుల చరిత్రను వక్రీకరించేలా ఉన్న ఈసినిమాపై త్వరలో హైకోర్టులో పిల్ వేయనున్నట్లు శివ ముదిరాజ్ వెల్లడించారు. మేము పండగ సాయన్న జీవితాన్ని వక్రీకరించారని ఆరోపించగా సినిమా యూనిట్ తప్పును సమర్ధించుకునేలా ఇది పండగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన మూవీ కాదని, 1336 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యం స్ధాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెపుతున్నారని మండిపడ్డారు. సినిమా ట్రైలర్ చూస్తే అందుకు విరుద్దంగా ఉందని, పూర్తిగా చరిత్రను వక్రీకరించే సినిమా తీసినట్లు అర్ధమవుతోందన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాను అడ్డుకుంటామని, హైకోర్టను కూడా ఆశ్రయించి న్యాయం కోరతామని శివ ముదిరాజ్ పేర్కొన్నారు.