Wedding Bells Ring at Khushbu’s Home: ఖుష్బూ ఇంట్లో పెళ్లి బాజాలు.. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించిన నరేంద్ర మోదీ!
కాబోయే కొత్త జంటను ఆశీర్వదించిన నరేంద్ర మోదీ!
Wedding Bells Ring at Khushbu’s Home: సీనియర్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఖుష్బూ సుందర్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి! ఆమె పెద్ద కుమార్తె అవంతిక.. త్వరలోనే శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో కలిసి ఏడడుగులు వేయడానికి రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఖుష్బూ ఫ్యామిలీ ఢిల్లీలో ఒక స్పెషల్ మూమెంట్‌ను షేర్ చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసి, తమ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందజేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఖుష్బూ, ఆమె భర్త.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సితో పాటు కాబోయే వధూవరులు అవంతిక-శ్రవణ్‌లు పీఎం మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారికి సాదరంగా స్వాగతం పలికారు. పెళ్లి పత్రికను అందుకున్న మోదీ.. కాబోయే కొత్త జంటను నిండు మనసుతో ఆశీర్వదించారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ తమకు సమయం కేటాయించినందుకు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. "గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీని కలవడం మాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రధాని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ఖుష్బూ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ ఫోటోల్లో ఖుష్బూ ట్రెడిషనల్ పింక్ సిల్క్ శారీలో మెరిసిపోగా.. అవంతిక-శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా కనిపించారు. ఒకప్పుడు వెండితెరపై స్టార్‌గా వెలిగి, ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్న ఖుష్బూ.. పొలిటికల్ అండ్ సినీ గ్లామర్‌ను కలగలిపి తన కూతురి పెళ్లిని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. మొత్తానికి పీఎం మోదీ స్వయంగా బ్లెస్సింగ్స్ ఇవ్వడంతో ఈ వెడ్డింగ్ కాస్తా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ కపుల్‌కు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.