Akhanda 2: అఖండ 2 రిలీజ్ ఎపుడంటే?

ఎపుడంటే?

Update: 2025-09-26 05:12 GMT

Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదట పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ'తో పాటు సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదల తేదీని డిసెంబర్ 5కి వాయిదా వేశారు. బాలకృష్ణ స్వయంగా ఈ విడుదల తేదీని ధృవీకరించారు. 'ఓజీ' చిత్రంతో పాటు థియేటర్ ఇంటర్వెల్ లో అఖండ 2' టీజర్ ఇటీవల విడుదల చేశారు. టీజర్ చివరిలో విడుదల తేదీని వెల్లడించారు.

అఖండ ఫస్ట్ పార్ట్ కూడా డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ అయి విజయం సాధించింది. ఇపుడు అదే సెంటిమెంట్ కలిసొస్తుందని భావిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు జియో హాట్ స్టార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. . బాలకృష్ణ సినిమాల్లోనే హయ్యెస్ట్ ధర అని టాక్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి అఘోర పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచింది.'అఖండ 2' పాన్-ఇండియా చిత్రంగా పలు భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News