Jailer 2: జైలర్ 2' సినిమా గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ మూవీ జూన్ 12, 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని ఆయన అధికారికంగా ప్రకటించారు. జైలర్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇటీవలే రజినీకాంత్ కేరళలో షూటింగ్‌లో పాల్గొన్నారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత, విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విడుదల తేదీని వెల్లడించారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
జైలర్ ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో, ఈ సీక్వెల్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. రజినీకాంత్ 'టైగర్' ముత్తువేల్ పాండియన్ పాత్రలో తిరిగి అలరించనున్నారు. ఈ సినిమాకు కూడా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన రమ్యకృష్ణ, శివ రాజ్‌కుమార్ వంటి తారలు ఈ సీక్వెల్‌లో కూడా కొనసాగనున్నారని సమాచారం. అలాగే, తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ మూవీ తర్వాత రజినీ కాంత్ కమల్ బ్యానర్ లో మూవీ చేయబోతున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు 46 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి నటించడం ఇదే మొదటిసారి. వారు గతంలో "అపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు.