Akhanda 2 Pre‑Release Event: బాలయ్య అఖండ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?
Akhanda 2 Pre‑Release Event: నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ చిత్రం అఖండ 2 విడుదలకు సిద్ధమవుతోంది. అఖండకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.
గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలు:
నిర్మాతలు తాజాగా సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన తేదీని, వేదికను అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 28న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో
సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ చరిత్రలో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్న తరుణంలో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారీ అంచనాలు:
అఖండ 2 చిత్రం తాండవం అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా మొదటి భాగం అఖండ హిందీ రాష్ట్రాల్లోనూ మంచి విజయం సాధించడంతో ఈ సీక్వెల్‌పై ఉత్తరాది ప్రేక్షకులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.