Mowgli 2025: నాని వాయిస్ తో.. మోగ్లీ 2025 గ్లింప్స్ రిలీజ్

మోగ్లీ 2025 గ్లింప్స్ రిలీజ్;

Update: 2025-08-30 13:35 GMT

Mowgli 2025: ప్రస్తుతం రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల 'మోగ్లీ 2025' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది అతని రెండవ సినిమా. 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా సాక్షి సాగర్ మదోల్కర్ నటిస్తోంది.ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందుతోంది.

ఈ సినిమా పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్‌ గ్లింప్స్‌తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. లేటెస్ట్ గా ఈ సినిమా గ్లింప్స్ (చిన్న టీజర్) ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఈ టీజర్‌కు నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక చిన్న ప్రేమ కథ చెబుతా అంటూ నాని వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలవుతుంది. రోషన్ కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

టీజర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్ కు ,వాయిస్ ఓవర్ చెప్పిన నానికి రోషన్ కనకాల కృతజ్ఞతలు తెలిపాడు . రామ్ చరణ్ తన టీజర్ రిలీజ్ చేయడం హనర్ గా భావిస్తున్నామని చెప్పాడు. నాని వాయిస్ తో తమ సినిమా కంటెంట్ ఓ లెవల్ కు వెళ్లిందన్నాడు.

Tags:    

Similar News