Megastar emotional: థియేటర్లో మీ విజిల్సే నాకు ప్రాణం..మెగాస్టార్ ఎమోషనల్

మెగాస్టార్ ఎమోషనల్

Update: 2026-01-21 06:08 GMT

Megastar emotional: మెగాస్టార్ చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు" చిత్రం భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఎమోషనల్ ట్వీట్ చేశారు. టికెట్ ధరల పెంపుదలపై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత చిరంజీవి స్పందన ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే, చిరంజీవి తన ట్వీట్‌లో నేరుగా కోర్టు వ్యాఖ్యలపై స్పందించకుండా, సినిమా సాధించిన ఘనతను, అభిమానుల ప్రేమాభిమానాలను కొనియాడారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారు.మన శంకర వరప్రసాద్ గారు సాధించిన అద్భుత విజయాన్ని చూసి నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నేను ఎప్పుడూ చెప్పేదే.. నేను మీ ప్రేమకు ప్రతిరూపాన్ని, అది నేడు మరోసారి నిరూపితమైంది.రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మీరు నాపై చూపించే ప్రేమ మాత్రం శాశ్వతం. థియేటర్లలో మీరు వేసే విజిల్స్ నాకు ప్రాణం. ఈ భారీ బ్లాక్‌బస్టర్ విజయం తెలుగు ప్రేక్షకులది, డిస్ట్రిబ్యూటర్లది , దశాబ్దాలుగా తన వెంట నిలిచిన మెగా అభిమానులది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కృషితోనే ఇది సాధ్యమైందని అభినందించారు.చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ హైకోర్టు టికెట్ ధరల పెంపు విషయంలో కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం, ప్రభుత్వం "అర్థరాత్రి మెమోలు" ఇవ్వడాన్ని తప్పుబట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం కొనసాగుతుండగానే, చిరంజీవి కేవలం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ పాజిటివ్ నోట్‌లో ఈ ట్వీట్ చేశారు.మరోవైపు, అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విజయంపై స్పందిస్తూ "Sankranthi BOSS-buster" అని ట్వీట్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News