Ayyappa Swamy Photo at Home: ఇంట్లో అయ్యప్ప స్వామి ఫోటో ఉంచుకోవచ్చా..? వాస్తు నిపుణులు చెబుతున్న కీలక నియమాలు ఇవే!

వాస్తు నిపుణులు చెబుతున్న కీలక నియమాలు ఇవే!

Update: 2026-01-02 09:32 GMT

Ayyappa Swamy Photo at Home: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం, హరిహర సుతుడు అయ్యప్ప స్వామి. సాధారణంగా శబరిమల యాత్ర చేసే భక్తులు 41 రోజుల పాటు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తూ స్వామిని పూజిస్తారు. అయితే మాల ధరించని సామాన్య భక్తులు కూడా ఇంట్లో అయ్యప్ప స్వామి ఫోటోను ఉంచుకోవచ్చని, కానీ కొన్ని పద్ధతులు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి ఫోటో ఉంచాలి?

అయ్యప్ప స్వామి 18 మెట్లపై చిన్ముద్రలో కూర్చున్న భంగిమలో ఉన్న ఫోటోను ఇంట్లో ఉంచుకోవడం అత్యంత శుభప్రదం. ఫోటో పరిమాణం ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అది మనసులో భక్తిని నింపేలా ఉండాలి.

ఫోటో ఎక్కడ ఉంచకూడదు?

సింహద్వారం: ఇంటి ప్రధాన ద్వారం బయట స్వామి ఫోటోను ఉంచడం శుభం కాదు.

వాహనాలు: నిరంతరం వాహనాల్లో అయ్యప్ప ఫోటోను ఉంచకూడదు. కేవలం శబరిమల యాత్రకు వెళ్లే సమయంలో రక్షణ కోసం తాత్కాలికంగా పెట్టుకోవచ్చు.

బెడ్‌రూమ్: పడక గదిలో లేదా అపవిత్రమైన ప్రదేశాలలో ఫోటోను ఉంచడం నిషిద్ధం.

హాలులో ఉంచితే: మీరు స్వామి ఫోటోను దేవుని గదిలో కాకుండా హాలులో ఉంచాలనుకుంటే, నిత్యం మూడుసార్లు హారతి ఇవ్వడం తప్పనిసరి. ఎందుకంటే అయ్యప్ప స్వామికి హారతి అంటే ప్రీతి.

పూజా విధానం మరియు నైవేద్యం:

ప్రతిరోజూ కర్పూర హారతి ఇస్తూ.. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి.

వారానికి ఒకసారి స్వామికి బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి.

ఇంట్లో అయ్యప్ప పూజ వల్ల కలిగే ప్రయోజనాలు:

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అయ్యప్ప స్వామిని ఇంట్లో భక్తితో పూజించడం వల్ల అనేక దోషాలు తొలగిపోతాయి..

శని దోష నివారణ: సాడేసాటి, అష్టమ శని, పంచమ శని ప్రభావం ఎదుర్కొనే వారికి అయ్యప్ప పూజ ఉపశమనాన్ని ఇస్తుంది.

దుష్ట శక్తుల నివారణ: నవగ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా చెడు దృష్టి (దిష్టి) ఇంట్లోకి ప్రవేశించదు.

కుటుంబ ప్రశాంతత: ఇంట్లో ఉండే మనస్పర్థలు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

భక్తితో, పవిత్రతతో అయ్యప్ప స్వామిని కొలిచే ఏ ఇంట్లోనైనా సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పండితులు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News