Lakshmi Narayan Rajyoga in October: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. అక్టోబర్ నెలలో గ్రహాల గమనం కారణంగా అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. అక్టోబర్ 6న శుక్రుడు, అక్టోబర్ 21న బుధుడు తులారాశిలోకి ప్రవేశించనున్నారు. ఐశ్వర్య ప్రదాత అయిన శుక్రుడు, బుద్ధి-జ్ఞానాలకు అధిపతి అయిన బుధుడు ఒకే రాశిలో కలవడంతో ఈ శక్తివంతమైన రాజయోగం సిద్ధించనుంది. ఈ యోగ ప్రభావం మొత్తం 12 రాశులపైనా ఉన్నప్పటికీ, ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయి. వారిపై లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.

ఆ మూడు అదృష్ట రాశులు ఇవే

తులా రాశి

తులారాశిలోనే ఈ కలయిక జరుగుతుండటంతో, ఈ రాశి జాతకులకు విశేషమైన రాజభోగాలు పట్టనున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఎదురులేని విజయం లభిస్తుంది.

ఆకస్మిక ధనలాభం కలిగి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో భారీగా లాభాలు చేకూరడమే కాకుండా, పొదుపు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వ్యాపార లేదా ఉద్యోగ రీత్యా విదేశీ పర్యటనలు, దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు అత్యంత లాభదాయకంగా మారతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ సమయం నిజమైన సువర్ణ కాలం అని చెప్పవచ్చు. వీరి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమాజంలో హోదా, ప్రత్యేక గుర్తింపు, నలుగురిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక పనులు, ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరిసి అన్ని విధాలుగా అనుకూల వాతావరణం నెలకొంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రాజయోగం ప్రధానంగా ఆర్థిక స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. చాలా కాలంగా అప్పులతో సతమతమవుతున్న వారికి ఊరట లభిస్తుంది; రుణ భారం తీరిపోయి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుని, ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఊహించని ప్రయోజనాలు దక్కి, అభివృద్ధి పథంలో దూసుకుపోతారు.

Tags: