Mangala Gowri Vrat Fasting Rules: మంగళ గౌరీ వ్రతం సమయంలో ఏం తినాలి..? ఏం తినకూడదు?
ఏం తినకూడదు?;
Mangala Gowri Vrat Fasting Rules: శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళ గౌరీ పూజ ఆచరిస్తారు. ముఖ్యంగా ఈ రోజున మహిళలు ఉపవాసం ఉంటారు. వివాహిత స్త్రీలు సాధారణంగా తమ భర్తల ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ఈ ఉపవాసం పాటిస్తారు. అవివాహిత స్త్రీలు మంచి భర్త, సంతోషకరమైన జీవితం కోసం ఉపవాసం ఉంటారు. అన్ని ఉపవాసాలు మాదిరిగానే, మంగళ గౌరీ ఉపవాసం కూడా కొన్ని నియమాలను పాటించాలి. కాబట్టి మంగళ గౌరీ వ్రతం సమయంలో ఏమి తినాలి..? ఏమి తినకూడదు..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మంగళ గౌరీ వ్రతం సమయంలో నీరు కూడా త్రాగకుండా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మీరు పండ్లు తింటూ ఉపవాసం ఉండవచ్చు. కానీ కొన్ని పదార్థాలు తినవద్దు.
ఏ ఆహారాలు తినవచ్చు?
ఉపవాస సమయంలో.. మీరు కాలానుగుణ పండ్లు, పండ్ల రసం, పాలు లేదా పెరుగు మొదలైనవి తినవచ్చు. చపాతీ, పూరీ, బంగాళాదుంప కూర, మఖానా, కొబ్బరి ఆధారిత వస్తువులు తినవచ్చు.
ఇంకా చదవండి: రక్షా బంధన్ నాడు రాఖీ కట్టడానికి శుభ సమయం ఏమిటి?
ఏ ఆహారాలు తినకూడదు?
ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదు. మాంసం, చేపలు, వేయించిన పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లితో చేసిన ఆహారాన్ని తినకూడదు.
మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోండి:
ఉపవాసం సమయంలో శరీరాన్ని స్వచ్ఛంగా, మనస్సును నిగ్రహంగా ఉంచుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. చెడు పదాలను వాడకుండా ఉండండి.