New Year Special: న్యూ ఇయర్ స్పెషల్.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
New Year Special: నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాలు భక్తుల తో పోటెత్తాయి. కొత్త ఏడాదిలో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఐనవోలు మల్లికా ర్జున స్వామి దేవాలయం, మేడారం జాతర, వేములవాడలోని భీమేశ్వర ఆలయం, కొండ గట్టులోని ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం, చిలుకూరి బాలాజీ ఆలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనాని కి 3 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, అభిషేకాలు నిలిపివేశారు. భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తు న్నారు. మరోవైపు అయ్యప్ప స్వాముల తాకిడి సైతం పెరిగింది. దీక్షలో ఉన్న స్వాములు, మాల విరమణ సందర్భంగా భక్తులు టూర్ లో భాగంగా పలు ఆలయాలను సందర్శించడంతోరద్దీ ఎక్కువైంది. హైదరాబాద్ వంటి నగరాల్లో రాత్రి పూట న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న యువతీ, యువకులు ఇవాళ ఉదయం నుంచి భక్తి శ్రద్దలతో దేవాలయాల బాట పట్టారు.