Wallet: రోజు మొత్తం ఎంత కష్టపడి సంపాదించినా.. నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా నిలవడం లేదా? ఎంత పొదుపు చేయాలనుకున్నా.. ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్లలా ఖర్చైపోతుందా? అయితే, మీ కష్టంతో పాటు మీరు జేబులో లేదా హ్యాండ్‌బ్యాగ్‌లో మోసే మీ ‘పర్సు’ కూడా మీ ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా?వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం వాడే పర్సు కేవలం డబ్బులు దాచుకునే సంచి మాత్రమే కాదు, అది సాక్షాత్ లక్ష్మీదేవి నివసించే స్థానం! మరి ఆ పర్సును ఎలా మెయింటైన్ చేయాలి? ఎలాంటి తప్పులు అసలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది తమ పర్సులో చిరిగిపోయిన నోట్లు, విరిగిపోయిన నాణాలు, ఎప్పుడో తెచ్చుకున్న పాత బిల్లులు, రసీదులు అలానే దాచుకుంటారు. అంతేకాదు, కొందరైతే మరణించిన తమ బంధువుల ఫోటోలను కూడా జ్ఞాపకార్థం పర్సులో పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇవన్నీ కూడా తీవ్రమైన ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. దీనివల్ల ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవని, డబ్బు నిలవకుండా చేతిలో నుంచి జారిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే, లెదర్ (తోలు)తో చేసిన పర్సులలో దేవుళ్ల ఫోటోలను అసలు ఉంచకూడదు.

మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం ఉండాలంటే పర్సులో ఏం ఉండాలి?మొదటిది.. పర్సు ఎప్పుడూ శుభ్రంగా, చక్కగా సర్దిపెట్టి ఉండాలి.రెండవది.. కరెన్సీ నోట్లను ఎప్పుడూ చిందరవందరగా కుక్కకుండా, ఒక పద్ధతి ప్రకారం నీట్‌గా సర్దుకోవాలి.

మూడవది.. పర్సులో చిన్న సైజు శ్రీ మహాలక్ష్మి చిత్రం లేదా పూజ చేసిన వెండి నాణెం, శ్రీ యంత్రం ఉంచుకోవడం చాలా శుభప్రదం.ఇక నాలుగవది.. ఎరుపు లేదా పసుపు రంగు చిన్న కాగితంపై 'శ్రీ' అనే అక్షరాన్ని రాసి పర్సులో పెట్టుకుంటే అది సిరిసంపదలను ఆకర్షిస్తుంది. అలాగే పర్సును ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు, కనీసం కొన్ని నాణెలు లేదా నోట్లు ఉండేలా చూసుకోవాలి.

Tags: