Saturn Turns Direct After 30 Years: 30 ఏళ్ల తర్వాత శని ప్రత్యక్ష సంచారం.. డిసెంబర్ 11 నుంచి ఈ 3 రాశులకు తిరుగులేని రాజయోగం..
తిరుగులేని రాజయోగం..
Saturn Turns Direct After 30 Years: నవగ్రహాలలో శనీశ్వరుడికి విశిష్ట స్థానం ఉంది. కర్మఫలదాతగా, న్యాయాధిపతిగా పిలిచే శని.. వ్యక్తులు చేసే పనులను బట్టి శుభ, అశుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. గ్రహాలన్నింటిలో నెమ్మదిగా కదిలే శని గ్రహ గమనంలో వచ్చే మార్పులు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం వక్రగతిలో కొనసాగుతున్న శని దేవుడు.. డిసెంబర్ 11న మీన రాశిలో ప్రత్యక్ష సంచారం కానున్నాడు. సుమారు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని ప్రత్యక్ష సంచారం జరుగుతుండటంతో జ్యోతిష్యశాస్త్ర పరంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. శని నేరుగా సంచరించడం వల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ.. మూడు రాశుల వారికి మాత్రం శనిదేవుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు తిరిగి ప్రారంభం కావడమే కాకుండా, కెరీర్‌లోని అడ్డంకులు తొలగిపోయి అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ఆ అదృష్ట రాశులేవో చూద్దాం..
మేష రాశి
శని ప్రత్యక్ష సంచారం మేష రాశి వారికి వృత్తి, ఆర్థిక రంగాలలో విశేషమైన సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు, విదేశీ ప్రాజెక్టుల ద్వారా విశేష లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు చదువులో రాణించి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని సంచారం గొప్ప ఆర్థిక పురోగతిని, స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గతంలో ఉన్న అప్పులు గణనీయంగా తగ్గి ఆర్థిక ఊరట లభిస్తుంది. అయితే పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారవేత్తలకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. కుటుంబంలో ఉన్న వివాదాలు తొలగిపోయి శాంతి, సంతోషాలు నెలకొంటాయి.
కుంభ రాశి
కుంభ రాశికి శనీశ్వరుడే అధిపతి కావడం వల్ల, శని మార్గీ సంచారం వీరికి అమితమైన శుభఫలితాలను తెచ్చిపెడుతుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన కోరికలు, పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. ఊహించని విజయాలు వరిస్తాయి. వేసిన ప్రణాళికలన్నీ విజయవంతమై ఆర్థికంగా అనూహ్యమైన ఎదుగుదల కనిపిస్తుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకోవడంతో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఉన్న సంక్షోభాలు సమసిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.