Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు
27.07.25 నుంచి 02.08.25 వరకు రాశిఫలాలు...;
పండగలు – పర్వదినాలు ...
––––––––––––––––––––––
28, సోమవారం, దూర్వాగణపతి వ్రతం
29, మంగళవారం, శ్రావణ మంగళ గౌరీ వ్రతం, నాగ పంచమి
30, బుధవారం, సూర్య షష్ఠి
––––––––––––––––––––––––––––
మేషం... (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఎంతటి పని చేపట్టినా విజయవంతమే. ఆలోచనలు మరింత కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలు అందరికీ శిరోధార్యంగా ఉంటాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. కాంట్రాక్టులు, టెండర్లు దక్కించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అనూహ్యంగా సొమ్ము అందుతుంది. వివిధ రూపాల్లో సొమ్ము అందుకుంటారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా కూడా లబ్ధి పొందుతారు. కుటుంబంలో మీపై ప్రేమాభిమానాలు చూపే వారు పెరుగుతారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసి ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలమైన సమయం. ఐటీ రంగం వారు నైపుణ్యతను నిరూపించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. 27,28 తేదీల్లో ఆరోగ్యభంగం, ఔషధసేవనం.బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శివాష్టకం పఠించండి.
వృషభం... (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల తీరి కొంత లబ్ధి చేకూరుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటర్వ్యూలు అంది విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. సొమ్ముకు లోటు ఉండదు. అయితే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని రావలసిన బాకీలు కూడా అందుతాయి. అప్పులు చాలావరకూ తీరతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యత అయినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అనుభవాలను అందరితో పంచుకుంటారు. ఐటీ రంగం వారికి ఊహించని ప్రాజెక్టులు రావచ్చు. 28,29 తేదీల్లో బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం... (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. సమస్యల బారి నుంచి బయటపడతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అవకాశాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. కొంత సొమ్ము అనుకోకుండా అంది అవసరాలు తీరతాయి. రుణబాధల నుంచి విముక్తి. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా ధనలబ్ధి. కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు. ద్వేషించిన వారే ప్రశంసిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. కొన్ని రుగ్మతలు కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. భాగస్వాములు పెట్టుబడులు పెంచుతారు. కొన్ని వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. క్రీడాకారులు, రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఐటీ రంగం వారిపై భారం తగ్గుతుంది. 30,31 తేదీల్లో రాబడి నిరుత్సాహపరుస్తుంది, రుణయత్నాలు సాగిస్తారు. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు బాధిస్తాయి. ఆస్తి విషయాలలో చర్చలు విఫలమవుతాయి. దేవీస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం... (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు శ్రమ పడ్డా పూర్తి కావు. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమకు తగిన ఫలితం రాక డీలాపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతారు. కాంట్రాక్టులు తప్పిపోతాయి. రావలసిన డబ్బు అందక ఇబ్బందులు పడతారు. రుణాలుచేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. మీ నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. కొంత నలత చేసి ఇబ్బంది పడతారు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు కొంత తగ్గి నిరాశ చెందుతారు. విస్తరణ కార్యక్రమాలు పెండింగ్‌లో పడతాయి. భాగస్వాములు ఒత్తిడులు పెంచుతారు. ఉద్యోగాలలో మార్పులు తథ్యం. బాధ్యతలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు నిరుత్సాహానికి లోనవుతారు.ఐటీ రంగం వారి శ్రమ మరింత పెరుగుతుది. 28,29 తేదీల్లో ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహం... (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వివాహ యత్నాలు మరింత ముమ్మరం చేసి,కొంత ప్రగతి సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబసమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. తండ్రి తరఫు వారి సహాయం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వైద్యసేవలు విరమిస్తారు. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు సైతం అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. పైస్థాయి నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. ఐటీ రంగం వారికి మరింత అనుకూలం. 27,28 తేదీల్లో ఆదాయం తగ్గి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య... (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
మిశ్రమంగా ఉన్నా కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన మీ మనస్సును హత్తుకుంటుంది. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు. కుటుంబంలోని అందరితోనూ సంతోషంగా గడుపుతారు. సోదరులతో వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. కొన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి మీపై ప్రశంసలు కురుస్తాయి. కొత్త పోస్టులు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటీ రంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. 01,02 తేదీల్లో పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. బాధ్యతలతో సతమతమవుతారు. కాలభైరవాష్టకం పఠించండి.
తుల... (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అప్రయత్నంగా సొమ్ము దక్కి అవసరాలు తీరతాయి. ఆస్తుల క్రయవిక్రయాలు ద్వారా కూడా లబ్ధి పొందుతారు. కుటుంబంలో ద్వేషించిన వారే అభిమానిస్తారు. సోదరులు, సోదరీల కలయిక సంతోషం కలిగిస్తుంది. వివాహ వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విధి నిర్వహణలో మీ సత్తా , నైపుణ్యతను నిరూపించుకుంటారు. పారిశ్రామిక, ఐటీ రంగం వారు తమ సత్తా చాటుకునే సమయం. రాజకీయవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. 30,31 తేదీల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో ఆకారణంగా తగాదాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం... (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే లక్ష్యాలు సాధించడంలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల ఆహ్వానాలు అందుతాయి. చిరకాల శత్రువులు మిత్రులుగా మారతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. పాతబాకీలు అందుతాయి. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. మీపై కుటుంబసభ్యుల మరింత నమ్మకం వ్యక్తం చేస్తారు. మీ నిర్ణయాలు అందరూ పాటిస్తారు. సోదరీల సమస్యలు పరిష్కరిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. కొంత నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. పెట్టుబడులు అందుతాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. ప్రమోషన్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు ప్రతిభను చాటుకుంటారు. ఐటీ రంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. 01,02 తేదీల్లో కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. మానసిక అశాంతి. భూవివాదాలు నెలకొంటాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు... (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
మొదట్లో ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. తద్వారా కొంత లబ్ధి చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఊహించిన విధంగా డబ్బు సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బాకీపడిన మొత్తాలు చెల్లిస్తారు. . స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కి సోదరులతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. పెట్టుబడులు మరింతగా పెరుగుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పైస్థాయి పోస్టులకు సిఫార్సు చేయడం ఆనందం కలిగిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. ఐటీ రంగం వారి యత్నాలలో పురోగతి ఉంటుంది. 27,28 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సోదరులతో తగాదాలు. రాబడి కొంత తగ్గే సూచనలు. శివపంచాక్షరి పఠించండి.
మకరం... (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
అనుకున్న కార్యాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. ధైర్యం, నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. విలాసవంతంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు. షేర్ల విక్రయాలలోనూ లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలు ఉత్సాహంగా జరుపుతారు. కొద్దిపాటి నలత చేసి ఇబ్బంది పడతారు. వైద్యసేవలు తప్పవు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ప్రమోషన్లు లభిస్తాయి. పైస్థాయి వారి నుంచి అభినందనలు అందుకుంటారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సత్కారాలు, సన్మానాలు. ఐటీ రంగం వారికి మరింత వెసులుబాట్లు కలుగుతాయి. 30,31 తేదీల్లో ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.
కుంభం... (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
క్రమేపీ మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. ప్రముఖులు మీకు చేదోడుగా నిలుస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఒక ఆహ్వానం అంది ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలోని అందరి ప్రేమను పౌందుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. కొంత నలత తప్పదు. అయినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాల బాట పడతారు. పెట్టుబడులు మరింత చేకూరుతాయి. ఉద్యోగాలలో మీపై ఉన్నతాధికారులు నమ్మకం పెంచుకుంటారు. మీరు కూడా వారి ఆదేశాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఐటీ రంగం వారు కొన్ని మార్పులు చూస్తారు. 01,02 తేదీల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు సంభవం. రాబడి తగ్గుతుంది. రుణాలు చేస్తారు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మీనం... (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. భవిష్యత్‌పై విద్యార్థులకు భరోసా కలుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. సొమ్ముకు లోటు ఉండదు. ఊహించని రీతిలో ధనలాభాలు. రుణాలు చాలావరకూ తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబంలోని అందరితోనూ ప్రేమను పంచుకుంటారు. శుభకార్యాల నిర్వహణలో సోదరీలు మీ సహాయం అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న దానికంటే మరింత మెరుగుపడతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న ప్రమోషన్లు దక్కుతాయి. విధి నిర్వహణపై మరింత శ్రద్ధచూపుతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ రంగం వారు అనుకున్నది సాధిస్తారు. 30,01 తేదీల్లో ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. మీఅభిప్రాయాలు కుటుంబసభ్యులు తిరస్కరిస్తారు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
–––––––––––––––––––––-------------------------------------