Nitya Kalyanam: తిరుమలలో నిత్య కల్యాణం ఎందుకు చేస్తారు.?

ఎందుకు చేస్తారు.?

Update: 2026-03-14 07:58 GMT

Nitya Kalyanam: తిరుమల శ్రీవారికి జరిగే అత్యంత విశిష్టమైన, భక్తులు అమితంగా ఇష్టపడే సేవల్లో 'నిత్య కల్యాణోత్సవం' ప్రధానమైనది. లోకకల్యాణం కోసం శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ప్రతిరోజూ జరుపుకునే ఈ వివాహ మహోత్సవం ప్రత్యేకతలు తెలుసుకుందాం. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల నుండి 1:00 గంటల వరకు ఈ సేవ జరుగుతుంది.ప్రధాన ఆలయ ప్రాకారంలోని వైభవోత్సవ మండపంలో ఈ కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

ఈ కల్యాణం పూర్తిగా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా విశ్వక్సేన ఆరాధన అటే విఘ్నాలు కలగకుండా చేసే పూజ. సంప్రోక్షణ, వంశ వృక్షాల పఠనం,భక్తుల సమక్షంలో స్వామివారికి అమ్మవార్లను అప్పగించడం.

స్వామివారు అమ్మవార్లకు మంగళసూత్రం కట్టే ఘట్టం (ఇది భక్తులకు అత్యంత పరవశాన్ని కలిగిస్తుంది). ఒక టికెట్‌పై ఒక జంట (భార్యాభర్తలు) లేదా ఇద్దరు వ్యక్తులకు అనుమతి ఉంటుంది. టీటీడీ (TTD) అధికారిక వెబ్‌సైట్‌లో కనీసం రెండు నుంచి 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. లక్కీ డిప్ (Lucky Dip) ద్వారా కూడా కొందరు భక్తులకు అవకాశం దక్కుతుంది.

కల్యాణోత్సవానికి వెళ్లే భక్తులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి:పురుషులు పంచె, కండువా లేదా కుర్తా, పైజామా.స్త్రీలు చీర లేదా పంజాబీ డ్రెస్ (దుపట్టాతో సహా).కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఒక పెద్ద లడ్డు , 2 చిన్న లడ్డులు ఇస్తారు. ఒక ఉత్తరీయం (అంగవస్త్రం) ఒక బ్లౌజ్ పీస్ బహుకరిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా, కల్యాణం ముగిసిన తర్వాత భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (Quick Darshan) కల్పిస్తారు.

తిరుమలలో బ్రహ్మోత్సవాలు లేదా కొన్ని ప్రత్యేక పండుగ రోజుల్లో (ఉదాహరణకు రథసప్తమి) ఈ నిత్య కల్యాణ సేవను రద్దు చేస్తారు.

నిత్య కల్యాణం ఎందుకు.?

తిరుమల శ్రీవారికి లేదా ఏ ఆలయంలోనైనా 'నిత్య కల్యాణం' జరిపించడం వెనుక ఆధ్యాత్మిక, సామాజిక, వ్యక్తిగతమైన లోతైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా "లోక కల్యాణం" కోసమే ఈ సేవను నిర్వహిస్తారు.. లోక కల్యాణం (Universal Wellbeing)

శాస్త్రం ప్రకారం, పరమాత్మ (శ్రీనివాసుడు) మరియు ప్రకృతి (శ్రీదేవి, భూదేవి) కలిస్తేనే సృష్టి జరుగుతుంది. వీరిద్దరి కల్యాణం నిత్యం జరగడం వల్ల ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని, సమయానికి వర్షాలు కురిసి, పంటలు పండుతాయని, ప్రజలందరూ శాంతి సౌఖ్యాలతో ఉంటారని నమ్ముతారు.

తిరుమలలో శ్రీవారికి ఒకరోజు కల్యాణం జరగకపోతే లోకానికి ఏదో కీడు జరుగుతుందనే భావన పూర్వం నుండి ఉంది. అందుకే బ్రహ్మోత్సవాలు లేదా కొన్ని ప్రత్యేక రోజులు మినహా, ఏడాది పొడవునా ఈ సేవను 'నిత్య కల్యాణం - పచ్చ తోరణం' లాగా నిర్వహిస్తారు.

Tags:    

Similar News