These 3 Zodiac Signs Should Stay Away from Black: ఉగాది వరకు ఈ 3 రాశుల వారు నలుపుకు దూరంగా ఉండాల్సిందే.. లేదంటే కష్టాలు తప్పవు..
లేదంటే కష్టాలు తప్పవు..
These 3 Zodiac Signs Should Stay Away from Black: భారతీయ సంప్రదాయంలో రంగులకు, రాశిచక్రాలకు విడదీయలేని సంబంధం ఉంది. ప్రతి రంగు ఒక ప్రత్యేకమైన తరంగాన్ని కలిగి ఉంటుంది. నలుపు రంగును శక్తివంతమైనదిగా భావించినప్పటికీ, అది కొన్ని సమయాల్లో ప్రతికూలతను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఉగాది పండుగ వరకు మూడు రాశుల వారు నల్లని దుస్తులు ధరించడం వల్ల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్చరిక వర్తించే ఆ 3 రాశులు ఇవే
మేష రాశి
మేష రాశికి అధిపతి కుజుడు. కుజుడు అగ్ని తత్వానికి ప్రతీక. ఈ సమయంలో మేష రాశి వారు నలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వారి సంకల్ప శక్తి తగ్గే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక ఎదురుదెబ్బలు తగలడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఎదురవ్వవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు. నలుపు రంగు చంద్రుని శీతత్వానికి విరుద్ధంగా పనిచేస్తుంది. దీనివల్ల ఈ రాశి వారు మానసిక అశాంతికి లోనయ్యే ప్రమాదం ఉంది. అనవసరమైన భయాలు, మానసిక ఒత్తిడి కలగకుండా ఉండాలంటే ఉగాది వరకు నలుపుకు దూరంగా ఉండి, తెలుపు లేదా లేత రంగులను ఎంచుకోవడం ఉత్తమం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి నలుపు రంగు వల్ల వ్యాపార, వృత్తి రంగాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు నల్లని దుస్తులు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు తగ్గి, అశాంతి పెరుగుతుందని గురూజీ వివరించారు. ముఖ్యంగా డీల్స్ కుదుర్చుకునేటప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకు నివారించాలి?
శని గ్రహ ప్రభావం బలంగా ఉన్నప్పుడు లేదా జాతక రీత్యా గ్రహ సంచారం అనుకూలించనప్పుడు నలుపు రంగు ప్రతికూలతను పెంచుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నలుపు శనికి ఇష్టమైన రంగు. శని దృష్టి పడినప్పుడు ఈ రంగు ఆ ప్రతికూల శక్తిని నిక్షిప్తం చేసుకుంటుంది. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే వరకు గ్రహ గతుల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ సంధి కాలంలో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం.