Education: ఆన్లైన్ పరీక్షలు -అవకాశాలు మరియు వ్యత్యాసాలు

అవకాశాలు మరియు వ్యత్యాసాలు;

Update: 2025-06-09 16:34 GMT

Education:ఆన్లైన్ పరీక్షలు ప్రస్తుతం విద్యా రంగంలో ముఖ్యమైన మార్పులలో ఒకటి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆన్లైన్ పరీక్షలపరంగా విద్యా విధానం ఓ కొత్త దారిలోకి ప్రవేశించింది. ఇది సౌకర్యవంతంగా కనిపించిన కొన్ని సమస్యలు ఉన్నాయి.

ఆన్లైన్ పరీక్షలు విద్యార్థుల సమయాన్ని మరియు ప్రయాణ ఖర్చులను ఆదా చేస్తాయి. ఇంటి నుంచే పరీక్ష రాయడం వల్ల విద్యార్థులు ఒత్తిడి లేకుండా రాయగలుగుతారు. ఇది టైమ్ మేనేజ్మెంట్ పరంగాను మెరుగ్గా ఉంటుంది.

అయితే టెక్నికల్ సమస్యలు,నెట్వర్క్ సమస్యలు,నకిలీ పరీక్షలు,సమర్థవంతమైన పరీక్షణాలేమి వంటి వంటివి ప్రధాన అవరోధాలు. కొన్ని పరీక్షలలో విద్యార్థులు నిజంగా పరీక్ష రాయడంలో కాకుండా ఎలా చీటింగ్ చేయాలో నేర్చుకుంటున్నారు.

విద్యాసంస్థలు ఆన్లైన్ పరీక్షలను నైతిక విలువలతో కలిపి నియమ నిబంధనలతో అమలు చేయాలి. ఏఐ ఆధారిత ప్రోక్టింగ్ టూల్స్, పేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ వంటివి ఈ సమస్యలను తగ్గించగలవు.

ఆన్లైన్ పరీక్షలు భవిష్యత్ విద్యలో భాగంగా కొనసాగడం ఖాయం. కాబట్టి విద్యార్థులు ఈ విధానం పట్ల సానుకూలంగా ఉండాలి. తగిన శిక్షణ, నైతిక బోధనతో ఇది ఫలవంతంగా ఉంటుంది.

పరిశీలించి చూస్తే ఆన్లైన్ పరీక్షలు ఒక రకమైన విద్య విద్యా స్వాతంత్ర్యాన్ని అందిస్తాయి. అవి వినియోగించే విధానం మీదే ఫలితాల ప్రభావం ఉంటుంది.

Tags:    

Similar News