Actress Priyanka Jain: బుల్లితెర నటి కల.. కోటి రూపాయల లోన్‌తో కొత్త జీవితానికి పునాది
కోటి రూపాయల లోన్‌తో కొత్త జీవితానికి పునాది
Actress Priyanka Jain: తెలుగు సీరియల్స్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రియాంక జైన్, తన వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి తాము కలల ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ఆమె ప్రకటించారు. ఈ జంట ఇంటి నిర్మాణం కోసం ఏకంగా కోటి రూపాయల లోన్ తీసుకుంది. "ఇది కేవలం ఇటుకలతో కాదు.. ఎన్నో ఆశలతో, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు, జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది" అని ఆమె భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
గత ఏడాది కొనుగోలు చేసిన స్థలంలో తమ శాశ్వత నివాసాన్ని నిర్మించుకుంటున్నామని ప్రియాంక తెలిపారు. నిర్మాణ పనులను ప్రియుడు శివకుమార్‌తో కలిసి పర్యవేక్షిస్తున్న వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని ప్రియాంక పేర్కొన్నారు.
ట్రోలింగ్‌ను దాటి ముందడుగు
గత కొంతకాలంగా ప్రియాంక - శివకుమార్ ప్రేమలో ఉంటూ, పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ జంట తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటామని ఇంతకుముందు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఇంటి నిర్మాణంపైనే వీరు పూర్తి దృష్టి పెట్టారు.
నెటిజన్ల మిశ్రమ స్పందన
ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపిస్తుంటే, మరికొందరు సాంప్రదాయ అంశాలను ప్రస్తావిస్తూ ముందు పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ విమర్శలను పట్టించుకోకుండా ఈ జంట తమ కలల ఇంటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది.