Benefits from Boda Kakara: పోషకాల గని.. బోడ కాకరతో ఇన్ని ప్రయోజనాలా.?
బోడ కాకరతో ఇన్ని ప్రయోజనాలా.?;
Benefits from Boda Kakara: బోడ కాకరకాయ (Spiny Gourd) కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బోడ కాకరకాయను కూరగాయగా వండుకుని తినవచ్చు. ఇది వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఈ కాలంలో దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
ప్రయోజనాలు
బోడ కాకరకాయలో విటమిన్ A, C, B1, B2, B3, B9, B12, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీనిని తీసుకోవడం చాలా మంచిది.
బోడ కాకరకాయలో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది.పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
దీనికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది . ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, కాబట్టి మధుమేహ రోగులకు ఇది చాలా ఉపయోగకరం.
బోడ కాకరకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఇందులోని ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, ఇతర యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
ఇది తక్కువ కేలరీలు ,అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బోడ కాకరకాయలోని విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. మొటిమలు, తామర వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
విటమిన్ A సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది .రేచీకటి వంటి సమస్యలను నివారిస్తుంది.
తలనొప్పి, జుట్టు రాలడం, చెవి నొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. అలాగే పక్షవాతం, వాపు ,అపస్మారక స్థితి వంటి సమస్యల విషయంలో కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.