Stomach Infections:వర్షాకాలంలో కడుపుకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఇవి పాటించండి

ఇన్ఫెక్షన్లు రాకుండా ఇవి పాటించండి;

Update: 2025-07-09 08:12 GMT

Stomach Infections: వర్షాలు మొదలైతే వ్యాధులు వస్తాయి. కడుపు అనేది సాధారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడుతుంది. ఎందుకంటే అది మనం తినే ఆహారంపై ఆధారపండి ఉంటుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కడుపు నొప్పికి ఎక్కువగా గురవుతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షాకాలంలో కడుపు ఇన్ఫెక్షన్లకు కారణాలు కలుషితమైన నీరు, అపరిశుభ్రత, బయటి ఆహారం.

కడుపు ఇన్ఫెక్షన్ల యొక్క సాధారణ లక్షణాలు విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి, బలహీనత, అలసట, జ్వరం, డీహైడ్రేషన్. ముఖ్యంగా పిల్లలలో డీహైడ్రేషన్ తీవ్రమైన సమస్య. కాబట్టి వర్షాకాలంలో కూడా నీరు ఎక్కువగా తాగాలి. మరిగించి చల్లబరిచిన నీటిని త్రాగే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి.

వర్షాకాలంలో, పళ్ళు తోముకోవడానికి కూడా నీటిని మరిగించడం లేదా ఫిల్టర్ చేయడం వల్ల అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే స్ట్రీట్ ఫుడ్‌ను వీలైనంత వరకు నివారించండి. తినడానికి ముందు, టాయిలెట్ ఉపయోగించిన తర్వాత మీ చేతులను బాగా కడుక్కోవాలి.

పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. కడుపు సమస్యలు, లక్షణాలను ముందుగానే పర్యవేక్షించండి. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చిన్న జీర్ణశయాంతర సమస్యలు కూడా తల్లి, డ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వర్షాకాల వ్యాధులు పెరిగినప్పుడు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడడంలో చాలా దోహదపడతాయి. నివారణ, అప్రమత్తత, అవసరమైన జాగ్రత్తలు ఎల్లప్పుడూ మనల్ని సంతోషంగా ఉంచుతాయి.

Tags:    

Similar News