Chicken vs Fish: చికెన్ వర్సెస్ చేపలు: ఆరోగ్యానికి ఏది ఎక్కువ మంచిది?
ఎక్కువ మంచిది?
Chicken vs Fish: నాన్‌వెజ్ ప్రియుల ఆహారంలో చికెన్,చేపలు రెండూ కీలకమైన భాగమే. బరువు తగ్గాలనుకునే వారి నుంచి కండరాలు పెంచుకోవాలనుకునే వారి వరకు ప్రతి ఒక్కరూ వీటిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే, ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరమనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
పోషకాహార నిపుణుల ప్రకారం.. చికెన్‌లో ప్రోటీన్ శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ భాగంలో లీన్ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అయితే, చేపలలో ఉండే ప్రోటీన్ చాలా సులభంగా జీర్ణమవుతుంది, శరీరం దీనిని సమర్థవంతంగా గ్రహిస్తుంది.
చేపల విషయంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే.. వాటిలో 'ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్' పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును పెంచడంలో, శరీరంలో మంటను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. సాధారణంగా చికెన్‌లో ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండవు. అలాగే, చేపలలో సంతృప్త కొవ్వులు (Saturated fats) చాలా తక్కువగా ఉంటాయి.
మరి ఏది బెటర్? తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ కావాలనుకునే వారికి చికెన్ మంచి ఎంపిక. అదే సమయంలో, గుండె ఆరోగ్యం, చర్మం , మెదడు సంరక్షణకు ఒమేగా-3 అందించే చేపలు అత్యంత ఉత్తమం. మీ ఆరోగ్య లక్ష్యాలకు తగినట్లుగా ఈ రెండింటిని మీ ఆహారంలో సమపాళ్లలో చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు!