Blood Pressure Medications Increase Cancer Risk: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగిస్తున్న కొన్ని రకాల కీలక ఔషధాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కి చెందిన క్యాన్సర్ పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఒక సంచలనాత్మక నివేదికను విడుదల చేసింది. అధిక రక్తపోటు వాపుల నివారణకు అత్యంత ఎక్కువగా వాడే హైడ్రోక్లోరోథయాజైడ్ తో పాటు మరో రెండు ప్రముఖ మందులను గ్రూప్-1 కార్సినోజెన్ కేటగిరీలో చేర్చింది. ఈ వార్త బయటకు రావడంతో బిపి మందులు వాడే రోగులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిపై వైద్య నిపుణులు స్పందిస్తూ రోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

IARC నివేదికలోని ముఖ్య అంశాలు

ఇది డయాబెటిస్, బిపి, గుండె సమస్యలు ఉన్నవారికి శరీరం నుండి అదనపు నీరు మరియు సోడియంను బయటకు పంపడానికి వైద్యులు ఎక్కువగా రాస్తుంటారు.

ఈ ఔషధం వల్ల చర్మం సూర్యరశ్మిలోని ఆల్ట్రావయోలెట్ కిరణాలకు ఎక్కువ సున్నితంగా మారుతుంది.

దీనివల్ల దీర్ఘకాలం ఈ మందు వాడే వారిలో చర్మ క్యాన్సర్ పెదవుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని IARC అధ్యయనాలు వెల్లడించాయి.

ఫ్లాగ్ చేయబడిన ఇతర మందులు

వోరికోనజోల్

తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు వాడే ఈ మందు కూడా చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

టాక్రోలిమస్

అవయవ మార్పిడి పొందిన వారిలో రిజెక్షన్ కాకుండా వాడే ఈ ఇమ్యూనోసప్రెసెంట్ వల్ల నాన్-హాడ్కిన్స్ లింఫోమా ప్రమాదం ఉంటుందని పేర్కొంది.

రోగులు భయాందోళన చెందవద్దు.. అసలు నిజం ఇది

IARC గ్రూప్-1 కార్సినోజెన్‌గా వర్గీకరించడం అంటే.. సదరు ఔషధానికి క్యాన్సర్ కలిగించే గుణం ఉందనే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అర్థం. కానీ, ఈ మందులు వాడే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని దీని అర్థం ఎంతమాత్రం కాదు.

డోసేజ్ & సమయం:

క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది వ్యక్తి వాడే డోస్, కాలపరిమితి, వారి శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది.

ఆకస్మికంగా మందులు ఆపొద్దు

క్యాన్సర్ భయంతో డాక్టర్ సలహా లేకుండా హఠాత్తుగా హైడ్రోక్లోరోథయాజైడ్ లేదా ఇతర బిపి మందులను ఆపేస్తే.. బిపి తీవ్రస్థాయికి పెరిగి గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే తక్షణ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డాక్టర్ సలహా తప్పనిసరి:

మీరు వాడే బిపి టాబ్లెట్లలో హైడ్రోక్లోరోథయాజైడ్ ఉందో లేదో చూసుకుని, అనుమానం ఉంటే మీ వైద్యుడిని సంప్రదించి ప్రత్యామ్నాయ మందుల గురించి చర్చించండి.

ఎండ నుండి రక్షణ:

ఈ మందులు వాడుతున్నవారు ఎండలో తిరిగేటప్పుడు చర్మానికి నేరుగా సూర్యరశ్మి తగలకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు, సన్‌స్క్రీన్ లోషన్లు, టోపీలు ధరించడం మంచిది.

క్రమం తప్పకుండా చర్మ పరీక్షలు

చర్మంపై లేదా పెదవులపై ఏవైనా విచిత్రమైన మచ్చలు, బొబ్బలు లేదా మార్పులు కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

Tags: