Drinking Water Right After Meals: ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాదు, ఆ ఆహారాన్ని ఎప్పుడు, ఎలా తీసుకోవాలో కూడా తెలియాలి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో తర్వాత నీరు తాగే విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు దీర్ఘకాలిక జీర్ణ సమస్యలకు దారితీస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనానికి, నీటికి మధ్య ఎంత సమయం ఉండాలి?

ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఆర్.పి. పరాశర్ అభిప్రాయం ప్రకారం.. ఆహారం జీర్ణం కావడానికి నీరు తాగే సమయం చాలా కీలకం:

భోజనానికి ముందు: భోజనం చేయడానికి కనీసం 30 నిమిషాల ముందు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

భోజనం చేసేటప్పుడు: తింటున్నప్పుడు ఎక్కువ నీరు తాగకూడదు. అవసరమైతే కేవలం కొద్ది మొత్తంలో గోరువెచ్చని నీటిని మాత్రమే సిప్ చేయవచ్చు.

భోజనం తర్వాత: తిన్న వెంటనే గటగటా నీళ్లు తాగడం ఏమాత్రం మంచిది కాదు. భోజనం ముగిసిన30 నిమిషాల తర్వాత నీరు తాగడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

వెంటనే నీరు తాగితే వచ్చే సమస్యలు ఏమిటి?

భోజనం చేసిన వెంటనే అధికంగా నీరు తాగడం వల్ల కడుపులోని జీర్ణ రసాలు పలచబడతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఈ క్రింది సమస్యలు తలెత్తుతాయి:

కడుపు ఉబ్బరం మరియు బరువుగా అనిపించడం.

గ్యాస్, అజీర్ణం మరియు అసిడిటీ

తిన్న తర్వాత విపరీతమైన అలసట లేదా నీరసంగా అనిపించడం.

జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఏం చేయాలి?

కేవలం నీరు తాగే సమయమే కాకుండా, మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

ఆహారాన్ని నమలడం: ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమలి తినడం వల్ల లాలాజలం కలిసి జీర్ణ ప్రక్రియ సులభమవుతుంది.

సమతుల్య ఆహారం: పోషకాలు ఉన్న ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం వల్ల జీవక్రియలు చురుగ్గా ఉంటాయి.

నిద్ర: తగినంత నిద్ర పోవడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది మరియు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

ప్రతి ఒక్కరి శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ. హమీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ఉత్తమం.

Tags: