Eating Too Many Spices: మసాలాలు మరీ ఎక్కువగా తింటున్నారా? మీ పేగులు ప్రమాదంలో పడ్డట్లే..

మీ పేగులు ప్రమాదంలో పడ్డట్లే..

Update: 2026-04-02 07:38 GMT

Eating Too Many Spices: మన భారతీయుల ఆహారంలో మసాలాలకు విడదీయలేని సంబంధం ఉంది. ఘాటైన మసాలా లేనిదే ముద్ద దిగని వారు కోకొల్లలు. అయితే ఈ రుచి వెనుక దాగి ఉన్న ముప్పు గురించి మీకు తెలుసా? అతిగా మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పేగుల పొర దెబ్బతినే ప్రమాదం

మసాలా ఆహారం పరిమితికి మించి తీసుకున్నప్పుడు పేగుల లోపలి సున్నితమైన పొర దెబ్బతింటుంది. మొదట్లో కేవలం గుండెల్లో మంట, గ్యాస్ మరియు ఎసిడిటీ వంటి సాధారణ సమస్యలుగా కనిపిస్తాయి. చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యం వల్ల పేగుల పొర దెబ్బతిని అల్సర్లు ఏర్పడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ అస్తవ్యస్తమై వంటి ప్రమాదకర సమస్యలకు దారితీస్తుంది.

మీరు గమనించాల్సిన లక్షణాలు:

మసాలా ఆహారం తిన్న తర్వాత మీలో ఈ క్రింది మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి:

తరచూ కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరంగా అనిపించడం.

గుండెల్లో మంట విపరీతమైన ఎసిడిటీ.

వాంతులు, విరేచనాలు లేదా మలబద్ధకం సమస్యలు.

ఆకలి మందగించడం, కడుపు నిండినట్లుగా అనిపించడం.

ఎవరు దూరంగా ఉండాలి?

డాక్టర్ గుప్తా సలహా ప్రకారం.. ఇప్పటికే కడుపు సంబంధిత వ్యాధులు ఉన్నవారు మసాలా ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఒకవేళ మసాలా తిన్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, అటువంటి వారు కనీసం రెండు నెలలకు ఒకసారి మాత్రమే మితంగా మసాలాలు తీసుకోవాలి. ఏ ఇబ్బందులు లేని వారు కూడా మసాలాలను మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి క్షేమకరం.

రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు. మీ శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోండి. పేగుల ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News