Feeling Tired Even After Sleeping and a Heavy Head: నిద్రపోయినా నీరసంగా ఉంటుందా.. తల భారంగా అనిపిస్తోందా? మీ శరీరం ఇస్తున్న డేంజర్ సిగ్నల్ ఇదే
తల భారంగా అనిపిస్తోందా? మీ శరీరం ఇస్తున్న డేంజర్ సిగ్నల్ ఇదే
Feeling Tired Even After Sleeping and a Heavy Head: సాధారణంగా రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోతే ఉదయాన్నే శరీరం, మనసు రెండూ ఉత్సాహంగా ఉండాలి. కానీ చాలామందికి దీనికి విరుద్ధంగా జరుగుతుంది. రాత్రి ఎంత బాగా నిద్రపోయినా, ఉదయం నిద్రలేవగానే తల భారంగా ఉండటం, ఒళ్లు నొప్పులు, నీరసం, చిరాకుగా అనిపిస్తుంటుంది. దీనిని కేవలం అలసట అని విస్మరిస్తే పొరపాటే.. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యం విషయంలో మీ శరీరం ఇస్తున్న హెచ్చరిక సంకేతం కావచ్చు..
నిద్ర ఉన్నా.. నిస్సత్తువ ఎందుకు?
ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి ప్రకారం.. నిద్ర పరిమాణం కంటే నిద్ర నాణ్యత ముఖ్యం. తగినంత నిద్ర తర్వాత కూడా తల బరువుగా ఉండటానికి ప్రధాన కారణాలు ఇవే..
నిద్రపోయే ముందు మొబైల్ చూడటం వల్ల ఆ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. దీనివల్ల శరీరం పడుకున్నా, మెదడుకు పూర్తి విశ్రాంతి దొరకదు.
శరీరంలో నీరు తగ్గడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదించి, ఉదయం పూట తల భారంగా అనిపిస్తుంది.
నిద్రపోయేటప్పుడు తప్పుడు దిండును వాడటం లేదా మెడను వంచి పడుకోవడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి తలనొప్పికి దారితీస్తుంది.
గదిలో గాలి సరిగ్గా ఆడకపోవడం లేదా సైనస్ సమస్యల వల్ల నిద్రలో ఆక్సిజన్ సరఫరా తగ్గితే ఉదయాన్నే తల తిరుగుతున్నట్లు ఉంటుంది.
మానసిక ఆందోళనలు నిద్రలో కూడా మెదడును ఆలోచనలతో నింపేస్తాయి, ఇది ఉదయం మనల్ని అలసిపోయేలా చేస్తుంది.
ఈ సమస్యను గుర్తించడం ఎలా?
ఒకవేళ మీరు ఈలక్షణాలను గమనిస్తే, మీరు మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని అర్థం..
1. ఉదయం నిద్రలేవగానే ఏకాగ్రత కుదరకపోవడం.
2. కళ్లు మంటగా అనిపించడం, తల తిరగడం.
3. మెడ బిగుసుకుపోయినట్లు ఉండటం.
4. రోజంతా ఏదో తెలియని చిరాకుగా ఉండటం.
నివారణ మార్గాలు
ఈ సమస్య నుండి బయటపడటానికి డాక్టర్లు ఈ చిట్కాలను పాటించాలి
స్లీప్ షెడ్యూల్: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్రలేవాలి.
డిజిటల్ డిటాక్స్: నిద్రపోయే గంట ముందే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టేయాలి.
హైడ్రేషన్: రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
సరైన దిండు: మెడకు మరియు తలకు హాయినిచ్చే సరైన దిండును ఎంచుకోండి.
ధ్యానం: పడుకునే ముందు 10 నిమిషాల యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది.
నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది శరీరాన్ని మళ్ళీ కొత్తగా తయారుచేసే ప్రక్రియ. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మీ మరుసటి రోజు ఉత్సాహంగా సాగుతుంది.