Health Risks or Benefits of Owning a Dog: కుక్కను పెంచుకుంటే ఆరోగ్యం సేఫా? అదెలా.?

ఆరోగ్యం సేఫా? అదెలా.?;

Update: 2025-07-10 10:36 GMT

Health Risks or Benefits of Owning a Dog: ఈ రోజుల్లో పెంపుడు కుక్కల పెంపకం అనేది సర్వసాధారణంగా మారింది. పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా కుక్కల్ని పెంచుకుంటున్నారు. పెంపుడు కుక్కలు అనేవి మనుషులతో కలిసి మెలిసి ఉండటానికి, ఆనందాన్ని పంచడానికి పెంచబడే జంతువులు. ఇవి మనుషులకు మంచి స్నేహితులుగా, తోడుగా ఉంటాయి. పెంపుడు కుక్కలు మనుషులకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లల్లో సామాజిక, భావోద్వేగ, అభిజ్ఞా అభివృద్ధికి తోడ్పడతాయి. చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తాయి.

ముఖ్యంగా పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22నిమిషాలు ఎక్కువగా నడుస్తారని లివర్‌పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. కుక్కలు ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. కొన్ని జాతులు ఇంటికి, కుటుంబానికి రక్షణగా ఉంటాయి.

Tags:    

Similar News