High BP Is Dangerous Not Just for the Heart: బీపీ పెరిగితే గుండెకే కాదు.. మెదడుకూ ముప్పే!

మెదడుకూ ముప్పే!

Update: 2026-05-21 08:23 GMT

High BP Is Dangerous Not Just for the Heart: అధిక రక్తపోటు అంటే హైబీపీ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది గుండెపోటు! కానీ, మనకు తెలియకుండానే ఇది మెదడును సైతం దెబ్బతీస్తుందని మీకు తెలుసా?.చాలాసార్లు సమస్య తీవ్రమయ్యే వరకు మనం దీన్ని గుర్తించలేం. ఎందుకంటే.. మెదడుపై హైబీపీ ప్రభావం చాలా అస్పష్టంగా మొదలవుతుంది. చిన్న చిన్న వస్తువులని ఎక్కడో పెట్టి మర్చిపోవడం, మనుషుల పేర్లు గుర్తుకురాకపోవడం, ఆలోచనలు నెమ్మదించడం, లేదా మాట్లాడుతున్నప్పుడు ఏకాగ్రత కుదరకపోవడం.. ఇవన్నీ మనం వృద్ధాప్యం అనుకుంటాం, లేదా పని ఒత్తిడి అనుకుని పొరబడతాం. కానీ అసలు కారణం.. మెదడులో రక్తనాళాలు దెబ్బతినడం!

మన శరీరానికి అందే ఆక్సిజన్‌లో 20 శాతం మెదడే వాడుకుంటుంది. అది ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం సాఫీగా రక్త సరఫరా జరగాలి. కానీ రక్తపోటు నియంత్రణలో లేనప్పుడు.. మెదడుకు రక్తాన్ని చేరవేసే సున్నితమైన నాళాలు దెబ్బతింటాయి. అవి బిగుతుగా మారి, సన్నబడతాయి. దీనివల్ల మీ జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరియు ఏకాగ్రత క్రమంగా క్షీణిస్తాయి.

ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. తలనొప్పి లాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే లోలోపల అనర్థం జరుగుతూనే ఉంటుంది. అందుకే హైబీపీ విషయంలో నిర్లక్ష్యం తగదు.వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడండి. ఆహారంలో ఉప్పు తగ్గించుకోండి.. రోజూ వ్యాయామం చేయండి. మీ రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. మీ మెదడును భద్రంగా కాపాడుకోండి!

Tags:    

Similar News