Oral Rehydration Electrolyte Powder: ఎలక్ట్రల్ పౌడర్: అధిక మోతాదు ప్రమాదకరమా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Oral Rehydration Electrolyte Powder: కాన్పూర్‌లో ఎలక్ట్రల్ పౌడర్ తాగిన నాలుగేళ్ల చిన్నారి మరణించిన సంఘటన తరువాత డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఉపయోగించే ఈ పౌడర్ వినియోగంపై ఆందోళన మొదలైంది. ఎలక్ట్రల్ పౌడర్ అనేది విరేచనాలు లేదా వాంతులు కారణంగా శరీరంలో తగ్గిన నీటి స్థాయిని తిరిగి నింపడానికి వైద్యులు సిఫార్సు చేసే ద్రావణం. ఇందులో ఉండే సోడియం, పొటాషియం శరీరంలో నీటి స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. అయితే ఇతర మందుల మాదిరిగానే, దీని అధిక మోతాదు ప్రమాదకరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రోలైట్‌లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని సోడియం, పొటాషియం స్థాయిలు దెబ్బతిని, గుండె, మూత్రపిండాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇది మరణానికి దారితీయకపోయినా, తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదం ఉందని.. కాబట్టి దీనిని సూచించిన పరిమాణంలో అవసరమైన వారు మాత్రమే తీసుకోవాలని సూచించారు. అధికంగా తీసుకోవడం వల్ల గుండె కూడా దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
ఎలక్ట్రోలైట్ పౌడర్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచించారు. ఎవరైనా తీవ్రమైన వాంతులు లేదా విరేచనాలు అనుభవిస్తున్నప్పుడు మాత్రమే దీనిని తీసుకోవాలి. కారణం లేకుండా ప్రతిరోజూ దీనిని తాగడం ఆరోగ్యానికి హానికరం. దీని మోతాదు కూడా వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు 1 లీటరు నీటిలో 1 ప్యాకెట్ కలిపి రోజంతా త్రాగాలి. 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, 500 మి.లీ నీటిలో 1 పౌచ్ కలిపి, ప్రతి 5-10 నిమిషాలకు చిన్న సిప్స్ ఇవ్వాలి. చిన్న పిల్లలకు డాక్టర్ సూచించిన మోతాదును మాత్రమే అనుసరించాలి.
వైద్యుడి సలహా లేకుండా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ ఎలక్ట్రోలైట్ పౌడర్‌ను తీసుకోకూడదు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ఉన్న వ్యక్తులు, వాంతులు, విరేచనాలు నిరంతరంగా ఉన్నవారు, ఏదైనా ఔషధానికైనా అలెర్జీ ఉన్నవారు, పాలిచ్చే తల్లులు, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దీనిని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి.