Sleepless Night: ఒక్కరోజు నిద్ర లేకుంటే అంత డేంజరా.?
అంత డేంజరా.?;
Sleepless Night: ప్రస్తుతం బిజీ లైఫ్ లో కంటిమీద కునుకుగా కూడా నోచుకోలేని వారు చాలా మంది ఉన్నారు.అంటే పెరుగుతున్న ఖర్చులు..సంపాదన ముసుగులో చాలీచాలని జీతాలతో మనిషి పొట్ట కూటి కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాడు. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో..నిద్ర కూడా అంతే ముఖ్యం.కడుపు నిండా తిన్నా కూడా నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయంట. అవును ఒక్క రాత్రి నిద్ర లేకున్నా.. కండరాలు , హార్మోన్లను ప్రభావితం చేస్తాయంట.
నిద్ర లేకపోవడం మిమ్మల్ని అలసిపోయేలా చేయడమే కాకుండా మీ శరీరం కండరాల అభివృద్ధి కష్టతరం అవుతుంది. మన కండరాలు నిరంతరం తమను తాము డెవలప్ చేసుకుంటాయి. ప్రతిరోజూ పాత కండరాల ప్రోటీన్లు విచ్ఛిన్నమవుతూ కొత్తవి కండరాల ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియలో తయారవుతాయి. ముఖ్యంగా మనం వయసు పెరిగే కొద్దీ లేదా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించినప్పుడు కండరాలను బలంగా ఉంచడానికి ఇది చాలా కీలకం.
ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే..నిద్ర లేమి తర్వాత కండరాల ప్రోటీన్ సంశ్లేషణ 18% తగ్గింది.ముఖ్యంగా పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు 24% తగ్గాయి.కార్టిసాల్ స్థాయిలు 21% పెరిగాయి. ఇది కండరాల విచ్ఛిన్నానికి దారితీస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పరిశోధనల్లో పాల్గొనేవారు ఎప్పటిలాగే భోజనం చేసినప్పటికీ ఈ మార్పులు సంభవించాయి. అంటే నిద్ర లేకపోవడం వల్ల వారి శరీరాలు ఆహారం నుంచి వచ్చే సాధారణ కండరాల నిర్మాణ సంకేతాలకు తక్కువ ప్రతిస్పందనను కలిగిస్తాయి.