Mustard oil: చెవి సమస్యలకు ఆవ నూనె.. ఎలా వాడాలో తెలుసా..?
ఎలా వాడాలో తెలుసా..?
Mustard oil: వర్షాకాలంలో చెవి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ కాలంలో చెవిలో మురికి పేరుకుపోవడం, చెవులు మూసుకుపోవడం, నొప్పి మరియు దురద వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. అయితే, ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం ఉందనే అంశంపై ప్రముఖ డైటీషియన్ దీప్శిఖా శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కీలక సూచనలు చేశారు.
చెవి మూసుకుపోవడానికి ఆవ నూనెతో పరిష్కారం
చెవి మూసుకుపోయినప్పుడు వెంటనే దానికి పరిష్కారం కావాలంటే.. ఆవ నూనె ఉపయోగించడం ఉత్తమ మార్గమని దీప్శిఖా శర్మ అంటున్నారు. కేవలం రెండు చుక్కల ఆవ నూనె వేయడం వల్ల ఈ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చని ఆమె సూచించారు. ఆవ నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు చెవిలో ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయని ఆమె తెలిపారు. ఈ నూనె చెవిలో పేరుకుపోయిన మురికిని మృదువుగా చేసి, బయటకు వచ్చేలా చేస్తుంది. తద్వారా చెవిని శుభ్రంగా ఉంచి, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, చెవి దురదను కూడా వెంటనే తగ్గిస్తుంది.
ఆవ నూనెను ఎలా ఉపయోగించాలి?
1. ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనెను గోరువెచ్చగా చేయండి. నూనె మరీ వేడిగా ఉండకుండా చూసుకోవాలి.
2. నూనె వేడిగా ఉన్నప్పుడు డ్రాపర్ ఉపయోగించి చెవిలో రెండు చుక్కలు వేయండి.
3. నూనె లోపలికి చేరేందుకు మీ తలను 5 నిమిషాల పాటు పక్కకు వంచి ఉంచండి.
4. ఆ తర్వాత శుభ్రమైన కాటన్ బాల్‌తో చెవిని మెల్లిగా తుడవండి.
ముఖ్య గమనికలు:
ఈ చిట్కా తేలికపాటి సమస్యలకు మాత్రమే. చెవిలో తీవ్రమైన నొప్పి లేదా ఏదైనా గాయం ఉంటే, వైద్యుడిని సంప్రదించకుండా ఎటువంటి నివారణను ప్రయత్నించవద్దు. పిల్లల చెవులకు ఏదైనా ఇంటి నివారణను ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.