Natural Ways to Support Fertility: గర్భధారణ సమయం మహిళల జీవితంలో ఎంతో మధురమైనది. అయితే హార్మోన్ల మార్పుల వల్ల ఆ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి, కాళ్ల వాపు, మలబద్ధకం వంటి సమస్యలు సాధారణంగా ఎదురవుతుంటాయి. గర్భధారణ సమయంలో ప్రతి చిన్న సమస్యకు మాత్రలు వేసుకోవడం క్షేమదాయకం కాదని వైద్యులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉదయాన్నే వికారం లేదా తలనొప్పి వేధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీటిలో పుదీనా ఆకులు వేసి తాగితే తక్షణ ఉపశమనం లభించి రోజంతా తాజాగా ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే వాంతులు లేదా కడుపులో తిప్పినట్లు అనిపిస్తే, గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ, అంతే పరిమాణంలో నల్ల మిరియాల పొడి, నల్ల ఉప్పు కలుపుకుని తాగడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

చాలామంది గర్భిణులను వేధించే మరో ప్రధాన సమస్య మలబద్ధకం. కడుపు సరిగ్గా శుభ్రం కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. దీనిని అధిగమించేందుకు గోరువెచ్చని నీటిలో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని తాగాలని ఆమె సూచించారు. నెయ్యి పేగులను లోపలి నుంచి తేమగా, మృదువుగా ఉంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, తద్వారా మలవిసర్జన సాఫీగా సాగుతుంది.

శరీరంలో ద్రవాలు చేరడం వల్ల చాలామందికి కాళ్ల వాపులు వస్తుంటాయి. ఈ సమయంలో శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడంతో పాటు, గోరువెచ్చని నీటిలో సముద్రపు ఉప్పు వేసి ఆ నీటితో కాళ్లకు కాపడం పెట్టడం లేదా కాసేపు కాళ్లను అందులో ఉంచడం ద్వారా వాపు తగ్గుతుంది. రక్తహీనత నివారణకు క్లోరోఫిల్ డ్రాప్స్ ఉపయోగపడుతున్నప్పటికీ, కేవలం ఇంటి చిట్కాలపైనే ఆధారపడకుండా వైద్యుల సలహాతో ఐరన్, ఫోలేట్ సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో అవసరం.

గర్భధారణ సమయంలో ఏవైనా సమస్యలు తీవ్రంగా ఉన్నా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా, సొంతంగా చిట్కాలు పాటించే ముందు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags: