Fatty Liver Problems: ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య.. కేవలం 3 నెలల్లో సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసా..?

కేవలం 3 నెలల్లో సహజంగా ఎలా తగ్గించుకోవాలో తెలుసా..?

Update: 2026-05-25 06:58 GMT

Fatty Liver Problems: మారుతున్న ఆధునిక జీవనశైలి, జంక్ ఫుడ్ సంస్కృతి వల్ల ఈ రోజుల్లో 'ఫ్యాటీ లివర్ సమస్య అత్యంత వేగంగా విస్తరిస్తోంది. పలు ఆరోగ్య నివేదికల ప్రకారం.. ప్రస్తుతం మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య వచ్చిన వారు కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

కాలేయంలో ఫైబ్రోసిస్ ఏర్పడక ముందే సరైన జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని తిరిగి మునుపటి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకురావచ్చు. ఒకవేళ నిర్లక్ష్యం చేసి సమస్య తీవ్రమైన సిర్రోసిస్ దశకు చేరుకుంటే మాత్రం కాలేయ మార్పిడి తప్పనిసరి అవుతుంది. మరి కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఫ్యాటీ లివర్‌ను సహజంగా ఎలా రివర్స్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కాలేయం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది?

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం సరైన ఆహారం, వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే ఫ్యాటీ లివర్ సమస్య సుమారు మూడు నెలల్లో అదుపులోకి వస్తుంది.

మద్యం సేవించే అలవాటు ఉన్నవారు దానిని పూర్తిగా లేదా క్రమంగా తగ్గించుకోవాలి.

కాలేయ ఆరోగ్యం ఎంతవరకు మెరుగుపడుతుందో తెలుసుకోవడానికి నెలకు ఒకసారి SGPT చేయించుకుంటూ ఉండాలి.

ఫ్యాటీ లివర్‌ను కరిగించే 4 సులువైన మార్గాలు..

కాలేయంలోని కొవ్వు కరగాలంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. డాక్టర్ల ప్రకారం.. వారానికి కనీసం ఐదు రోజులు వేగంగా నడవాలి .

రోజుకు కనీసం 5,000 నుండి 7,000 అడుగులు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి.

వారంలో రెండు రోజులు తేలికపాటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి.

భోజనం చేసిన తర్వాత బద్ధకంగా కూర్చోకుండా కనీసం 10 నిమిషాలు నడిచే అలవాటు చేసుకోవాలి.

ఉదయం పూట ఎండలో నడవడం వల్ల లభించే విటమిన్-డి కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

చక్కెర వినియోగానికి చెక్..

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు8 కాలేయానికి తీవ్రమైన శత్రువులు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రాసెస్ చేసిన చక్కెర ప్రధాన కారణం. అందువల్ల స్వీట్లు, చక్కెర కలిపిన టీ లేదా కాఫీ, బేకరీ పదార్థాలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్‌ను వీలైనంత వరకు దూరం పెట్టాలి. తీపిని పూర్తిగా మానేయకపోయినా, చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఆకుకూరలు, చేదు కూరగాయలు

పాలకూర, బ్రోకలీ, దోసకాయ వంటి ఆకుకూరలతో పాటు బీట్‌రూట్, కాకరకాయ వంటి కూరగాయలు కాలేయంలో వచ్చే సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు తమ రోజువారి ఆహారంలో కనీసం ఏదో ఒక రకమైన ఆకుకూర లేదా కూరగాయ ఉండేలా చూసుకోవాలి.

ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం

కాలేయ కణాలు తిరిగి పునరుజ్జీవనం చెందడానికి ప్రొటీన్ చాలా అవసరం.

శాకాహారులు:

పెసరపప్పు, శనగలు, రాజ్మా, మొలకెత్తిన గింజలు, పనీర్, టోఫులను ఆహారంలో చేర్చుకోవాలి.

మాంసాహారులు:

ఉడకబెట్టిన గుడ్లు, గ్రిల్డ్ చికెన్, చేపలను నూనె తక్కువగా ఉపయోగించి వండుకుని తినవచ్చు.

వీటికి తోడు కాలేయ పనితీరు మెరుగుపడటానికి విటమిన్ బి12 లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరం.

Tags:    

Similar News