RSV Infection in Children: పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్.. ఎలా నివారించాలంటే?

ఎలా నివారించాలంటే?

Update: 2026-01-17 12:08 GMT

RSV Infection in Children: రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని ‘బ్రాంకియోలైటిస్‌’ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 3,4 రోజుల తర్వాత దీని లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగు ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వస్తుంది. ఆక్సిజన్‌ లెవెల్‌ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్‌ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్‌లో ఉంచే వైద్యం చేయాలి.

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లడం సరికాదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు ఆర్‌ఎస్‌వీ ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలి.

RSV ప్రారంభ లక్షణాలు ఏమిటి?

చలిగా ఉండటం..

తీవ్రమైన ఒళ్లు నొప్పులు..

గొంతు నొప్పి

ముక్కు కారటం

తేలికపాటి జ్వరం

వేగంగా శ్వాస తీసుకోవడం

ముక్కులు మూసుకుపోవడం

నిరంతర ముక్కు కారడం..

Tags:    

Similar News