Coconut Water: కొబ్బరి నీళ్ళతో ఇన్ని ఉపయోగాలా?

ఇన్ని ఉపయోగాలా?;

Update: 2025-08-26 14:01 GMT

Coconut Water:కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రోలైట్స్ (పొటాషియం, సోడియం, మెగ్నీషియం) ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూస్తాయి. వ్యాయామం చేసిన తర్వాత లేదా వేసవిలో తాగితే మంచిది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్ళలో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కొబ్బరి నీళ్ళు మూత్రపిండాలను శుభ్రం చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. కొబ్బరి నీళ్ళలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నీళ్ళు సహజమైన మలబద్ధక నివారిణిగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రోజూ కొబ్బరి నీళ్ళు తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. దీంతో ముఖం కాంతివంతంగా ఉంటుంది. కొబ్బరి నీళ్ళను ముఖానికి రాస్తే చర్మం తేమగా, తాజాగా ఉంటుంది. మార్కెట్‌లో దొరికే కృత్రిమ పానీయాల కంటే కొబ్బరి నీళ్ళు ఆరోగ్యకరమైనవి. ఇందులో ఉన్న పోషకాలు తక్షణ శక్తిని ఇస్తాయి. కొబ్బరి నీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టు తేమగా, మృదువుగా ఉంటుంది. ఈ రకంగా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది చాలా మంచిది.

Tags:    

Similar News