Struggling with Sleeplessness: నిద్రలేమితో సతమతమవుతున్నారా? రాత్రి పడుకునే ముందు మీరు చేసే ఈ 3 తప్పులే కారణం..

రాత్రి పడుకునే ముందు మీరు చేసే ఈ 3 తప్పులే కారణం..

Update: 2026-02-03 11:33 GMT

Struggling with Sleeplessness: ఆరోగ్యకరమైన జీవనశైలికి పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, కనీసం 7 నుండి 8 గంటల నిద్ర కూడా అంతే అవసరం. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే. అవేంటో ఒకసారిా౩ఋ చూద్దాం.

గ్యాడ్జెట్స్‌తో గడపడం

మనం చేసే అతి పెద్ద తప్పు.. పడుకునే ముందు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూడటం. ఈ స్క్రీన్‌ల నుండి వచ్చే నీలి కాంతి, మన శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. దీనివల్ల మెదడు ఇంకా పగలే అని భ్రమపడి, నిద్రను దూరం చేస్తుంది.

చిట్కా: పడుకోవడానికి కనీసం గంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేయండి.

భారీ - కారంగా ఉండే భోజనం

రాత్రిపూట వేయించిన పదార్థాలు, మసాలా దట్టించిన ఆహారం తీసుకోవడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం కష్టపడటం వల్ల మీకు విశ్రాంతి దొరకదు. ఇది నిద్రకు భంగం కలిగించడమే కాకుండా

ఊబకాయం కు దారితీస్తుంది.

చిట్కా: రాత్రి భోజనం ఎప్పుడూ తేలికగా, పడుకోవడానికి రెండు గంటల ముందే ముగించండి.

కెఫిన్ - ఆల్కహాల్ అలవాటు

పడుకునే ముందు కాఫీ, టీ లేదా ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర పడుతుందని కొందరు భావిస్తారు. కానీ వాస్తవానికి, కాఫీలోని కెఫిన్ మీ మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఆల్కహాల్ వల్ల నిద్ర వచ్చినట్లు అనిపించినా, అది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

ప్రశాంతమైన నిద్ర కోసం సూత్రాలు

స్థిరమైన సమయం: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

వాతావరణం: పడకగది ప్రశాంతంగా, చీకటిగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి.

రిలాక్సేషన్:

పడుకునే ముందు కాసేపు పుస్తకం చదవడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి త్వరగా నిద్ర పడుతుంది.

Tags:    

Similar News