Non-Veg Sources: ఇవి వెజ్ అనుకుంటే పొరపాటే.. నాన్ వెజ్ నుంచి..
నాన్ వెజ్ నుంచి..;
Non-Veg Sources: మనలో రకరకాల ఆహారాలను ఇష్టపడే వారు ఉంటారు. కొంతమంది మాంసాహారం తినడానికి ఇష్టపడతారు, మరికొందరు శాఖాహారం తినడానికి ఇష్టపడతారు. చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల శాఖాహారులుగా మారుతున్నారు. కొందరు తమ పెంపకం, మతపరమైన కారణాల వల్ల ఆ పద్ధతిని అనుసరించవచ్చు. మరికొందరు తమ సొంత ప్రయోజనాల కోసం వెజ్ కు అలవాటుపడుతున్నారు. కానీ మీరు తినే అనేక ఆహారాలు మాంసాహారమని మీకు తెలుసా?
మీరు శాఖాహారమని చెప్పుకునే అనేక ఆహారాలు వాస్తవానికి మాంసాహారమే. కాబట్టి మీరు ఈ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాంసాహార పదార్థాలు కలిగిన శాఖాహార వంటకాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూప్
అనేక ఆరోగ్య ప్రయోజనాలు, రుచికరమైన రుచి కలిగిన సూప్.. చాలా మందికి ఇష్టమైన వంటకాల్లో ఒకటి. కానీ ఆ సూప్ నిజానికి మాంసాహారం అని చెబితే మీరు నమ్ముతారా? ఎందుకంటే కొన్ని రెస్టారెంట్లు సూప్‌లను తయారు చేయడానికి చేపల ఆధారిత సాస్‌లను ఉపయోగిస్తాయి. శాఖాహార సూప్‌లలో కూడా వీటిని వాడతాయి.
చీజ్
జున్ను అనేది పాల ఉత్పత్తి. చాలా ఆహార వంటలలో జున్నును ఉపయోగిస్తారు. మీరు శాకాహారి అని భావించి ఆనందించే చీజ్‌లో జంతువుల ప్రేగుల నుండి తీసుకోబడిన రెన్నెట్ అనే ఎంజైమ్ ఉంటుంది.
జెల్లీ
జెల్లీ తినని వారు ఎవరూ ఉండరు. జెల్లీలో ప్రధాన పదార్ధం జెలటిన్ అని మనందరికీ తెలుసు, ఇది జంతువుల నుండి తీస్తారు. కానీ, ఇటీవల చాలా మంది తయారీదారులు జెలటిన్‌కు బదులుగా స్టార్చ్ లేదా ఇతర సారూప్య ఆహార ఉత్పత్తులు, రసాయనాలను ఉపయోగించడం ప్రారంభించారు,
బీర్/వైన్
బీర్ అనేది విస్తృతంగా ప్రసిద్ధి చెందిన మద్య పానీయం. చేపల మూత్రాశయాల నుండి వచ్చే ఐసింగ్ గ్లాస్‌ను బీర్, వైన్ వంటి పానీయాలకు రంగులు యాడ్ చేయడానికి ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రసిద్ధ బీర్, వైన్ బ్రాండ్లు ఐసింగ్‌గ్లాస్‌ను ఉపయోగిస్తున్నాయి.