Thyroid Problems: భారత్‌లో ప్రమాదకరంగా మారుతున్న థైరాయిడ్.. నిపుణులు సూచిస్తున్న ఆహార నియమాలు ఇవే..

నిపుణులు సూచిస్తున్న ఆహార నియమాలు ఇవే..

Update: 2026-05-26 10:28 GMT

Thyroid Problems: భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు అంచనాలకు మించి వేగంగా పెరుగుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, దేశంలో సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా థైరాయిడ్ అనగానే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుందనే భావన ఉండేది. కానీ ఇటీవల కాలంలో పురుషులు, చిన్న పిల్లలలో కూడా ఈ కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రారంభంలో కనిపించే చిన్న చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. . థైరాయిడ్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడిజం (హార్మోన్ ఉత్పత్తి తగ్గడం), మరొకటి హైపర్‌థైరాయిడిజం (హార్మోన్ ఉత్పత్తి పెరగడం). ఈ రెండింటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే సరైన మందులతో పాటు మన రోజువారీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్‌ను పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు.

ఆహారంలో చేసుకోవాల్సిన ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..

థైరాయిడ్ బాధితులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?..

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం

థైరాయిడ్ ఉన్నవారిలో తరచూ నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. వీటిని అధిగమించడానికి ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఏం తినాలి?: పప్పులు, పనీర్, గుడ్లు, పెరుగు, చేపలు మరియు చికెన్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. ఇది శరీర జీవక్రియను మెరుగుపరచడానికి, అలసటను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

సెలీనియం, జింక్ చాలా అవసరం

థైరాయిడ్ హార్మోన్లు శరీరంలో సమతుల్యంగా ఉండాలంటే సెలీనియం, జింక్ వంటి సూక్ష్మపోషకాలు చాలా కీలకం.

ఏం తినాలి?: గుమ్మడికాయ గింజలు, నట్స్, తృణధాన్యాలు మరియు సముద్రపు ఆహారంలో ఇవి పుష్కలంగా లభిస్తాయి.

అయోడిన్ సమతుల్యత ముఖ్యం

థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరమే. కానీ దానిని అవసరానికి మించి ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే వంటల్లో అయోడైజ్డ్ ఉప్పును పరిమితంగా, మితంగా మాత్రమే వాడాలి.

థైరాయిడ్ ఉన్నప్పుడు వేటికి దూరంగా ఉండాలి?

ప్రాసెస్ చేసిన, చక్కెర ఆహారాలు వద్దు:

కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, నూనెలో బాగా వేయించిన పదార్థాలు, ఎక్కువ చక్కెర ఉండే స్వీట్లకు దూరంగా ఉండాలి. ఇవి శరీరంలో మంటను పెంచి, వేగంగా బరువు పెరిగేలా చేస్తాయి.

పేగు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి:

జీర్ణక్రియ బాగుంటేనే థైరాయిడ్ అదుపులో ఉంటుంది. ఇందుకోసం ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలతో పాటు పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే కూరగాయలను ప్రతిరోజూ తీసుకోవాలి.

Tags:    

Similar News